AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tunisia migrant boat accident: పెను విషాదం.. 110 మందితో వెళ్తున్న వలసదారుల పడవ బోల్తా.. 25కి చేరిన మృతుల సంఖ్య

టునీషియాలో 110 వలసదారులతో వెళుతున్న బుధవారం సముద్రంలో పడవ బోల్తా పడింది. అప్రమత్తమైన కోస్ట్​గార్డ్ సిబ్బంది 76 మందిని రక్షించింది. ప్రమాదం జరిగిన రోజున పది మృతదేహాలను కోస్ట్​గార్డ్ సిబ్బంది వెలికితీశారు. ఈ ఘటనలో..

Tunisia migrant boat accident: పెను విషాదం.. 110 మందితో వెళ్తున్న వలసదారుల పడవ బోల్తా.. 25కి చేరిన మృతుల సంఖ్య
Tunisia Migrant Boat Accident
Srilakshmi C
|

Updated on: Apr 14, 2023 | 11:37 AM

Share

టునీషియాలో 110 వలసదారులతో వెళుతున్న బుధవారం సముద్రంలో పడవ బోల్తా పడింది. అప్రమత్తమైన కోస్ట్​గార్డ్ సిబ్బంది 76 మందిని రక్షించింది. ప్రమాదం జరిగిన రోజున పది మృతదేహాలను కోస్ట్​గార్డ్ సిబ్బంది వెలికితీశారు. ఈ ఘటనలో బోటు కింద చిక్కుకున్న పది మంది మృతదేహాలను గురువారం వెలికితీశారు. దీంతో మృతుల సంఖ్య 25కి చేరింది. మరో 15 మంది గల్లంతయ్యారు. బాధితులంతా ఆఫ్రికాలోని సబ్​సహారాకు చెందినవారని అధికారులు తెలిపారు. మధ్యధర సముద్రాన్ని దాటి ఐరోపా దేశాలకు​ప్రతీయేట పెద్ద సంఖ్యలో వలసదారులను స్మగ్లర్లు అతి చిన్న పడవల్లో తరలిస్తుంటారు. దీంతో సముద్రం దాటుతుండగా ఆ పడవలు తరచుగా ప్రమాదాలకు గురవుతుంటాయి. అతిచిన్న పడవల్లో వందలాది మందిని తరలించే క్రమంలో అవి నీటమునగడంతో వందలాది అమాయకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

మూడు వారాల క్రితం టునీషియాలో జరిగిన మరో పడవ ప్రమాదంలో 29 మంది వలసదారులు మృతి చెందగా.. 67 మంది గల్లంతయ్యారు. గత నెలలో ఇటలీలోని అయోనియన్ సముద్రంలో పడవ మునిగి 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఘటన సమయంలో బోటులో మొత్తం 100 మంది వలసదారులు ఉన్నారు. కొద్ది నెలల క్రితం లెబనాన్‌ నుంచి సిరియా వెళుతున్న వలసదారుల పడవ బోల్తాపడి 86 మంది మరణించారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పడవలో దాదాపు 150 మందికిపైగా వలసదారులు ఉన్నారు. మిగతా వారి ఆచూకీ తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.