AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dairy Farm: కనీవినీ ఎరుగని విషాదం.. డెయిరీ ఫామ్‌లో పేలుడు.. 18వేల ఆవులు బలి..

అమెరికాలో టెక్సస్‌లోని ఒక డెయిరీ ఫామ్‌లో కనీవినీ ఎరుగని విషాదం. ఒక భారీ బాంబు పేలుడులో ఏకంగా 18వేల ఆవులు చనిపోయాయి. సౌత్‌ ఫోర్స్‌ ఫామ్‌లో ఆవులని పాలు పితకడానికి సిద్ధం చేస్తున్నప్పుడు ఈ అసాధారణమైన పేలుడు జరిగింది. మూగజీవాలు, ముఖ్యంగా ఆవులు ఇంతపెద్ద స్థాయిలో చనిపోవడం..

Dairy Farm: కనీవినీ ఎరుగని విషాదం.. డెయిరీ ఫామ్‌లో పేలుడు.. 18వేల ఆవులు బలి..
Blast
Shiva Prajapati
|

Updated on: Apr 13, 2023 | 9:55 PM

Share

అమెరికాలో టెక్సస్‌లోని ఒక డెయిరీ ఫామ్‌లో కనీవినీ ఎరుగని విషాదం. ఒక భారీ బాంబు పేలుడులో ఏకంగా 18వేల ఆవులు చనిపోయాయి. సౌత్‌ ఫోర్స్‌ ఫామ్‌లో ఆవులని పాలు పితకడానికి సిద్ధం చేస్తున్నప్పుడు ఈ అసాధారణమైన పేలుడు జరిగింది. మూగజీవాలు, ముఖ్యంగా ఆవులు ఇంతపెద్ద స్థాయిలో చనిపోవడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. పాలు సేకరించే భవనంలో ఈ పేలుడు జరిగింది. దీంతో అక్కడ భయానక, హృదయ విదారక దృశ్యాలు షాకింగ్‌గా ఉన్నాయి.

ఆవు పేడను తొలగించే యంత్రం ఓవర్‌ హీట్‌ కావడమే ఈ పేలుడుకు కారణమని భావిస్తున్నారు. దీనికి- పశువుల నుంచి వెలువడే మీథేన్‌ గ్యాస్‌ తోడై పేలుడు భారీస్థాయిలో ఉన్నట్లు ప్రాథమికంగా అంచనాకు వస్తున్నారు.

సీన్‌ చూస్తే, ఒక భారీ బాంబు పేలినట్లుగా కనిపించింది. అయితే కళ్లముందే మూగజీవాలు ఇంతపెద్ద సంఖ్యలో బలికావడం, అవి ఛిద్రంగా పడిపోవడం అక్కడివారిని కలిసివేసింది. ఇంతటి పేలుడు అమెరికన్లను ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనలో డెయిరీ ఫామ్‌లో పనిచేస్తున్న సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ఒక వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..