AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఇకపై లోయర్ బెర్తులు ఇక వారికి మాత్రమే రిజర్వ్..

రైలు ప్రయాణాల్లో లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లోయర్‌ బెర్తుల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. దివ్యాంగులతోపాటు వారి కుటుంబీకులకు అమలయ్యే విధాన పరమైన..

Indian Railway: రైల్వే ప్రయాణికులకు అలర్ట్‌.. ఇకపై లోయర్ బెర్తులు ఇక వారికి మాత్రమే రిజర్వ్..
Indian Railway
Srilakshmi C
|

Updated on: Apr 14, 2023 | 11:00 AM

Share

రైలు ప్రయాణాల్లో లోయర్ బెర్తుల కేటాయింపు విషయంలో భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లోయర్‌ బెర్తుల కేటాయింపులో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇవ్వనుంది. దివ్యాంగులతోపాటు వారి కుటుంబీకులకు అమలయ్యే విధాన పరమైన నిర్ణయాన్ని కూడా ఇండియన్‌ రైల్వే వెల్లడించింది. గతంలో దివ్యాంగుల ప్రయోజనం కోసం రైల్వే రిజర్వేషన్ కేంద్రాలను సంప్రదించకుండానే ఐర్సీటీసీ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకునేందుకు రైల్వే శాఖ అవకాశం కల్పించించి. ఇప్పుడు వీరికి సంబంధించి మరో కీలక నిర్ణయం ప్రకటించింది. రైలు ప్రయాణ సమయంలో దివ్యాంగుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తూ మెయిల్‌, ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలోని ప్రతి బోగిలో లోయర్‌ బెర్తులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే వారితో ప్రయాణించే కుటుంబీకులకు కూడా లోయర్‌ బెర్త్‌ రిజర్వేషన్‌ కేటాయించనుంది.

స్లీపర్ క్లాస్‌లో నాలుగు బెర్త్‌లు (రెండు లోయర్, రెండు మిడిల్), థర్డ్ ఏసీలో రెండు బెర్త్‌లు (ఒక లోయర్‌, ఒక మిడిల్‌), థర్డ్‌ క్లాస్‌లో రెండు (ఒక లోయర్‌, ఒక మిడిల్) బెర్త్‌లు దివ్యాంగులకు రిజర్వ్‌ చేస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. గరీబ్‌రథ్‌లో రెండు లోయర్‌, రెండు అప్పర్‌ బెర్తులు దివ్యాంగులకు కేటాయించారు. చైర్‌కార్‌ రైళ్లలో కూడా రెండు సీట్లు వికలాంగులకు కేటాయించనున్నారు. కాగా ఒంటరిగా ప్రయాణించే మహిళలు, చిన్న పిల్లలతో ప్రయాణించే వృద్ధులు, మహిళలకు ఈ సౌకర్యాన్ని ఇప్పటికే రైల్వే శాఖ కల్పించింది. మరోవైపు సీనియర్ సిటిజన్స్‌కు ఇచ్చే టికెట్ల రాయితీ అంశంలో రైల్వే శాఖ త్వరలో నిర్ణయం తీసుకోనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
జ్యేష్ఠ అమావాస్య: ఈ తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం దూరమవుతుందా..?
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
డైట్ ఖర్చు లేకుండా బరువు తగ్గాలంటే జొన్నలతో ఇలా..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
6 రోజులు.. 5దేశాలు.. యుద్ధం వేళ ప్రధాని మోదీ విదేశీ టూర్..
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మంటల్లో కాలి బూడిదైన కావేరి ట్రావెల్
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
చిమ్నీ శుభ్రం చేయడం కష్టమా? ఈ సులభమైన పద్ధతులతో ఇక టెన్షన్ లేదు!
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. కష్టాలు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
పెట్రో భారం తర్వాత సామాన్యులకు మరో షాక్.. CNG ధర కూడా పెంపు..
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మన అకౌంట్‌లో పొరపాటున డబ్బు క్రెడిట్‌ అయితే ఏం చేయాలి?
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
మీకు అతిగా వేడి అనిపిస్తుందా? శరీరంలో ఆ విటమిన్ తగ్గిందేమో
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..
అద్భుతం.. శివాలయం తలుపులు తెరవగానే కనిపించిన సీన్ చూసి..