Bhima Jewellers: అక్షయ తృతీయ వేళ కస్టమర్లకు కళ్లు చెదిరే ఆఫర్స్ ఇస్తున్న ‘భీమా’ జ్యువెల్లర్స్..

అక్షయ తృతీయ.. శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుందని ప్రజల విశ్వాసం. అక్షయ తృతీయను చాలా మంది సెంటిమెంటల్‌గా భావిస్తారు. ఆ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం గానీ, బంగారంపై పెట్టుబడి పెట్టడం గానీ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అక్షయ తృతియ రోజు శుభప్రదమైన

Bhima Jewellers: అక్షయ తృతీయ వేళ కస్టమర్లకు కళ్లు చెదిరే ఆఫర్స్ ఇస్తున్న ‘భీమా’ జ్యువెల్లర్స్..
Bhima Jewellers
Follow us
Shiva Prajapati

| Edited By: Ravi Kiran

Updated on: Apr 14, 2023 | 6:06 PM

అక్షయ తృతీయ.. శ్రేయస్సు, అదృష్టాన్ని ఇస్తుందని ప్రజల విశ్వాసం. అక్షయ తృతీయను చాలా మంది సెంటిమెంటల్‌గా భావిస్తారు. ఆ రోజున బంగారాన్ని కొనుగోలు చేయడం గానీ, బంగారంపై పెట్టుబడి పెట్టడం గానీ చేస్తారు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సంపద, శ్రేయస్సు కలుగుతుందని నమ్మకం. అక్షయ తృతియ రోజు శుభప్రదమైన రోజుగా భావించి ప్రజలు బంగారం, వజ్రాలు, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం, పెట్టుబడులు పెడుతుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా జ్యువెలరీ షాపులు ఆఫర్లు ప్రకటిస్తాయి. అందులో ప్రముఖ జ్యువెలరీ మాల్ ‘భీమా’.

1925 నుంచి విశ్వాసం, నమ్మకం చురగొంటూ వస్తున్న భీమా జ్యువెలర్స్.. ఈ అక్షయ తృతీయకు స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉంది. హోసూర్‌లో కొత్త ఆభరణాల షోరూమ్‌ని ప్రారంభించిన భీమా.. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో 17 బ్రాంచ్‌లను కలిగి ఉంది. అక్షయ తృతీయ సందర్భంగా మంచి ఆఫర్లను అందిస్తోంది. ఇందులో భాగంగా కస్టమర్ల కోసం ప్రీబుకింగ్ ఆప్షన్‌ను తీసుకువచ్చింది భీమా. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా మీ కలల ఆభరణాలను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది.

అక్షయ తృతీయ కోసం భీమా అడ్వాన్స్ బుకింగ్ ఆప్షన్‌తో సిద్ధంగా ఉంది. ఈ బుకింగ్స్ కేవలం రూ. 1000 నుండి ప్రారంభమవుతాయి. ఇక రూ. 75,000 కంటే ఎక్కువ మొత్తంలో బుకింగ్ చేసుకుంటే ఉచిత బంగారు నాణెం పొందవచ్చు. ఈ ఆఫర్ ఏప్రిల్ 18 వరకు వర్తిస్తుంది. అన్ని భీమా స్టోర్‌లలో ఏప్రిల్ 20 నుండి 23 వరకు అద్భుతమైన ఆఫర్‌లతో అక్షయ తృతీయను జరుపుకోండి. బంగారంపై గ్రాముకు రూ. 650 తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రూ.100 అదనంగా, ఇక వజ్రాలపై రూ. 7,500 తగ్గింపు, 2 ఉచిత బంగారు కాయిన్స్‌ పర్ క్యారెట్, వెండిపై 50 శాతం మేకింగ్ చార్జీల తగ్గింపు పొందండి.

Bhimagold.comలో ఆన్‌లైన్‌లో అద్భుతమైన ఆఫర్‌లు అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి రూ. 10,000 కొనుగోలుపై రూ. 1000 తగ్గింపు పొందండి. ప్రతి రూ. 25,000 కొనుగోలుపై ఉచిత బంగారు నాణెం పొందండి. ఈ ఆఫర్లు ఏప్రిల్ 14 నుండి 23 వరకు చెల్లుబాటులో ఉంటాయి.

అక్షయ తృతీయను పురస్కరించుకుని, భీమా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ విష్ణుశరణ్ కె భట్ మాట్లాడుతూ.. “సంవత్సరాలుగా, భీమా జ్యువెలర్స్ మా కస్టమర్ల మద్దతుతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. మేము ఈ సంవత్సరం అక్షయ తృతీయను స్వాగతిస్తూ, మా కస్టమర్లకు అత్యుత్తమ ప్రయోజనాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా స్థాపనలో అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించడాన్ని కొనసాగిస్తామని హామీ ఇస్తున్నాము. ఈ పవిత్రమైన సీజన్ మీకు శాంతి, శ్రేయస్సు, అదృష్టం, విజయాన్ని అందించాలని ప్రార్థిస్తున్నాము.’’

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..