ప్రాణం తీసిన అతివేగం.. గమ్యం చేరకుండానే మృత్యు ఒడికి.. అదే కారణమా
కొన్ని ప్రమాదాలు జరిగిన తీరును ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారు కొద్ది సేపటికే విషాదంలో మునిగిపోయారు. వేగంగా వెళ్తున్న బస్సు లారీ ని ఢీ కొట్టింది...
కొన్ని ప్రమాదాలు జరిగిన తీరును ఊహించుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. అప్పటి వరకు ఆనందంగా ఉన్న వారు కొద్ది సేపటికే విషాదంలో మునిగిపోయారు. వేగంగా వెళ్తున్న బస్సు లారీ ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. రోడ్డుపై లారీని నిలిపి ఉంచడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం(Anantapur) డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. కర్నూలు నుంచి అనంతపురం వస్తుండగా గుత్తి సమీపంలో రోడ్డు ప్రమాదానికి(Accident) గురైంది. 44వ నంబరు జాతీయ రహదారిపై కొత్తపేట వద్ద రోడ్డుపై నిలిచి ఉన్న భారీ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది.ఈ ఘటనలో ఓ మహిళ మృతి(Death) చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. మృతురాలు గుంతకల్లు కు చెందిన రామేశ్వరమ్మగా పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డుపై నిలిచి ఉన్న భారీ వాహనాన్ని.. డ్రైవర్ గమనించకుండా బస్సును వేగంగా నడుపడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read
Big News Big Debate: రష్యాపై ఫైనాన్సియల్ వార్ మొదలైందా? అగ్రదేశాల ఆంక్షలతో ఎవరికి ఎంత నష్టం?
దేవుడి దర్శనానికి వెళ్తే.. పెద్ద పులి దర్శనం.. భయంతో చెట్టెక్కిన యువకులు !! వీడియో
Face Mask: మాస్క్ ఎందుకు దండగ.. వచ్చేసింది అధునాతన ఎయిర్ ప్యూరిఫైయర్..ఇది ఎలా పనిచేస్తుందంటే..