దేవుడి దర్శనానికి వెళ్తే.. పెద్ద పులి దర్శనం.. భయంతో చెట్టెక్కిన యువకులు !! వీడియో

దేవుడి దర్శనానికి వెళ్తే.. పెద్ద పులి దర్శనం.. భయంతో చెట్టెక్కిన యువకులు !! వీడియో

Phani CH

|

Updated on: Feb 25, 2022 | 9:17 PM

దైవదర్శనం కోసం వెళ్లిన వారికి పెద్దపులి ఎదురయ్యింది. ప్రాణభయంతో వణికిపోయారు. బైక్‌పై వచ్చిన వాళ్లు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు.

దైవదర్శనం కోసం వెళ్లిన వారికి పెద్దపులి ఎదురయ్యింది. ప్రాణభయంతో వణికిపోయారు. బైక్‌పై వచ్చిన వాళ్లు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. చెట్టు కింద పులి , చెట్టు మీద ఇద్దరు యువకులు ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని చాతర్‌పూర్‌లో జరిగింది. పన్నా టైగర్‌ రిజర్వ్‌ లోని ఆలయాన్ని సందర్శించేందుకు ఏడాదిలో ఒకేసారి అనుమతిస్తారు. దాంతో ఇద్దరు యువకులు ఆ ఆలయంలో దైవదర్శనం కోసం టైగర్‌ రిజర్వ్‌ లోకి వెళ్లారు. అదే సమయంలో దారిలో పులి ఎదురుకావడంతో దాని నుంచి తప్పించుకోడానికి వాళ్లు పక్కనే ఉన్న చెట్టు ఎక్కారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అటవీశాఖ సిబ్బంది ఆ ఇద్దరు యువకులను కాపాడారు. దీంతో బ్రతుకు జీవుడా అంటూ ఆ యువకులు అక్కడ నుంచి జారుకున్నారు. నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియో చూసిన నెటిజన్లు గుడికి వెళ్లకముందే దేవుడు కనిపించాడుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Also Watch:

గడ్డకట్టే మంచులో జవాన్ల శిక్షణ.. ఎప్పుడైనా చూసారా.. వీడియో

ఇంగ్లీష్‌లో ఇరగదీసిన బామ్మ‌.. ఇంట‌ర్నెట్ ఫిదా.. వీడియో

Mammikka: స్టార్‌గా మారిపోయిన 60 ఏళ్ల కూలీ.. షాకింగ్‌ మేకోవర్‌ !! వీడియో

Manjula Ghattamaneni: కళావతి హుక్ స్టెప్‌ వేసిన మహేష్ సిస్టర్ మంజుల.. వీడియో

Bigg Boss OTT: బిగ్ బాస్‌ ఓటీటీకి వెళ్లే కంటెస్టెంట్స్ వీరే.. వీడియో