Andhra Pradesh: ఆ వార్డులో ఎన్నికలు వస్తే భయం భయం.. గెలిచినా యముడి దగ్గరికే.. కారణమిదే

గ్రామంలో 7 వ వార్డులో నెంబర్ గా నిలవాలంటేనే హడలెత్తిపోతున్నారు..దైవ భక్తి,ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడే ఆ గ్రామంలో ఇప్పుడు 7వ వార్డులో మనశ్శాంతి కోల్పోతున్నారు. గ్రామంలో ఏకగ్రీవంగా వార్డు నెంబర్ గా అవకాశం ఇచ్చిన మరణం మాత్రం తప్పదు అంటున్నారు గ్రామస్థులు. ఒకే కుటుంబంలా కులమత భేదాలు లేవని ఓకేతాటిపై ఉండే ఆ గ్రామంలో ఒక వార్డులో వింతగా ఘటన చోటుచేసుకుంటుంది..

Andhra Pradesh: ఆ వార్డులో ఎన్నికలు వస్తే  భయం భయం.. గెలిచినా యముడి దగ్గరికే.. కారణమిదే
Buchempeta panchayat in East Godavari district
Follow us
Pvv Satyanarayana

| Edited By: Basha Shek

Updated on: Aug 20, 2023 | 2:07 PM

చుట్టూ పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణం..ప్రేమ ఆప్యాతలకు,మమతనురాగాలకు పుట్టిల్లు గా ఉండే బుచ్చంపేట గ్రామంలో ఒక వార్డులో చిచ్చు రేపుతోంది. గ్రామంలో 7 వ వార్డులో నెంబర్ గా నిలవాలంటేనే హడలెత్తిపోతున్నారు..దైవ భక్తి,ఆచార సాంప్రదాయాలు ఉట్టిపడే ఆ గ్రామంలో ఇప్పుడు 7వ వార్డులో మనశ్శాంతి కోల్పోతున్నారు. గ్రామంలో ఏకగ్రీవంగా వార్డు నెంబర్ గా అవకాశం ఇచ్చిన మరణం మాత్రం తప్పదు అంటున్నారు గ్రామస్థులు. ఒకే కుటుంబంలా కులమత భేదాలు లేవని ఓకేతాటిపై ఉండే ఆ గ్రామంలో ఒక వార్డులో వింతగా ఘటన చోటుచేసుకుంటుంది.. గత 25 ఏళ్ళ నుండి 7వ వార్డులో పోటీ చేసి గెలిచిన వార్డు నెంబర్ ఎవరుకుడా బ్రతికి బట్టకట్టలేదని గ్రామస్థులు చెబుతున్నారు.. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలంలో ఉన్న బుచ్చంపేట పంచాయతీ లో ఉన్న 7 వ వార్డులో ఇప్పటివరకు 6గురు పైగా మరణించారని ,పోటీచేసి గెలిచిన వారు మాత్రమే చనిపోతున్నారని,పదవి చేపట్టిన పది నెలల్లో నే ఎందుకు చనిపోతున్నారనేది ఆ గ్రామస్తులు లకు ప్రశ్న గానే మిగిలిపోయింది. అన్ని ఉన్న అల్లుడు నోట్లో శని అన్నట్లు అభివృద్ధి లో ముండదుకు వేస్తున్న బుచ్చంపేట గ్రామంలో ఇలా చనిపోవడం పై ఇప్పుడు రాజానగరం నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది.

అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లి 7వ వార్డులో పోటీచేమని చెప్పిన ఆ వార్డును తొలగించేయండి అంటూ అచ్చర్య పోయేలా సమాధానం ఇస్తున్నారు గ్రామస్థులు..ఇటీవల కాలంలో ఆ గ్రామంలో వార్డు నెంబర్ గా పోటీ చేసి ,గెలిచిన ఏడాదిలోపే యువకులు పది నెలల కూడా పదవి చేయకుండానే అందరూ చనిపోయారని,7వ వార్డు తప్ప మిగిలిన 11 వార్డులలో పండు ముసలిని గెలిపించిన వాళ్ళకు ఏవిధమైన ఇబ్బందులు రావడంలేదని, కేవలం 7వ వార్డులో మాత్రమే పోటీచేసిన ఎవరైనా చనిపోవడం జరుగుతుందని ముక్త కంఠం తో గ్రామస్థులు చెబుతున్నారు..ఇకపై ఆవార్డులో పోటీకి ఎవరు రారనే సమాధానం గట్టిగానే వినిపిస్తోంది..ఏది ఏమైనా బుచ్చంపేట7వ వార్డులో గెలిచిన వారే చనిపోవడం పై జరిగే వింత ఘటనల మిస్టరీ విడేప్పుడో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..