AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. ఆ కామెంట్సే కారణం..

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నుంచి ఆయన్ను వెంటాడుతున్న ఈ కేసులో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముకుల్ చంద్ వల్ల తీవ్రంగా నష్ట పోయినట్టు 2016లో సెల్వమణి వ్యాఖ్యలు చేశారు. దాంతో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశారు ఫైనాన్షియర్ ముకుల్ చంద్. ముకుల్ చంద్ బోత్రా చనిపోయినా.. ఆ కేసును కొనసాగిస్తున్నారు ఆయన కుమారుడు గగన్ బోత్రా. సోమవారం విచారణ కోర్టులో విచారణ ఉండగా..

Andhra Pradesh: మంత్రి రోజా భర్త సెల్వమణికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ.. ఆ కామెంట్సే కారణం..
Rk Selvamani
Vijay Saatha
| Edited By: Shiva Prajapati|

Updated on: Aug 29, 2023 | 12:33 PM

Share

ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా భర్త సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. 2016 నుంచి ఆయన్ను వెంటాడుతున్న ఈ కేసులో తాజాగా నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ముకుల్ చంద్ వల్ల తీవ్రంగా నష్ట పోయినట్టు 2016లో సెల్వమణి వ్యాఖ్యలు చేశారు. దాంతో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశారు ఫైనాన్షియర్ ముకుల్ చంద్. ముకుల్ చంద్ బోత్రా చనిపోయినా.. ఆ కేసును కొనసాగిస్తున్నారు ఆయన కుమారుడు గగన్ బోత్రా. సోమవారం విచారణ కోర్టులో విచారణ ఉండగా.. సెల్వమణి కోర్టుకు హాజరుకాలేదు. దాంతో సెల్వమణిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది చెన్నై జార్జ్ టౌన్ కోర్ట్. తదుపరి విచారణ సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది.

ఇంటర్వ్యూలో చెప్పిన మాటతో..

మంత్రి నగరి రోజా భర్త వివాదంలో ఇరుక్కున్నాడు. ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన వాఖ్యలు ఆయన మెడకు చుట్టుకున్నాయి.. ఒక ఫైనాన్షియర్ వల్ల తాను తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ మంత్రి రోజా భర్త సెల్వమణి ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. తెలుగుతోపాటు తమిళ సినిమాలకు పని చేశారు రోజా భర్త సెల్వమణి.. అయితే 2016లో ఓ టీవీ ఇంటర్వ్యూ సందర్భంగా ఒక ఫైనాన్షియర్ పై అభ్యంతర వ్యాఖ్యలు చేశాడు. ఒక ఫైనాన్షియల్ వల్ల తాను తీవ్రంగా నష్టపోయానని ఆ ఫైనాన్స్ పేరు ప్రస్తావిస్తూ ఒక టీవీ ఛానల్ కు 2016లో ఇంటర్వ్యూ ఇచ్చాడు సెల్వమణి. ఆ ఇంటర్వ్యూను చూసిన సదరు ఫైనాన్షియర్ సెల్వమణిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెన్నైలోని జార్జ్ టౌన్ కోర్టులో సెల్వమణిపై పరువు నష్టం దావా కేసు వేశాడు. ముకుల్ చంద్ బోత్ర అనే ఫైనాన్షియర్ పై సెల్వమణి వాక్యాలు చేశాడు.

కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయిన ఫైనాన్షియర్..

2016 నుండి ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే కొద్ది సంవత్సరాల క్రితమే ఫైనాన్షియల్ ముకుల్ చంద్ మరణించాడు.. తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని సహించని ముకుల్ చంద్ కుమారుడు గగన్ బోత్రా కేస్ ను కొనసాగించారు. అయితే కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కావాల్సిందిగా ఇదివరకే సమన్లు జారీ చేసింది. కోర్టు సమన్లు జారీ తర్వాత కూడా విచారణకు గైర్హాజరయ్యారు మంత్రి రోజా భర్త.. దీంతో ఆగ్రహించిన కోర్టు సెల్వమణిపై నాన్వెలబుల్ వారెంట్ జారీ చేసింది… తదుపరి విచారణను సెప్టెంబర్ 22 కు వాయిదా వేసింది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు సెల్వమణి.. ప్రస్తుతం ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్, ఫెఫ్సీ అధ్యక్షుడిగా ఉన్నారు.. కోర్టు జారీ చేసిన నాన్వెలబుల్ వారిపై మంత్రి రోజా భర్త ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్‌ చేయండి..