Vijayawada: నిద్రపోతున్న భర్తపై సలసల మసిలే నీరు పోసిన భార్య.. అంత ఆగ్రహానికి కారణమిదేనట..!
విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న భర్తపై సల సల మసిలే నీటిని పోసింది. దాంతో అతని ఒళ్లంతా కాలిపోయింది. మరి ఆమె ఎందుకు అలా చేసింది? భర్తపై అంత ఆగ్రహం రావడానికి కారణం ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. భర్త తాగొచ్చి వేధిస్తున్నాడని సలసల మరిగే వేడి నీళ్ళు భర్తపై పోసింది భార్య. మద్యం మత్తులో నిద్రపోతున్న సమయంలో వేడి వేడి నీళ్ళు పోయటంతో ఒళ్లంతా కాలి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు భర్త.

ఇంత వైలెంట్ గా ఉన్నారేంట్రా బాబు.. వీళ్లను ఎవరికైన చూపించండ్రా.. అన్నా డైలాగ్ ఈ మధ్య భార్యలకు బాగా సూట్ అవుతుంది. తాగొచ్చిన భర్త చేతిలో తన్నులు తినే రోజులు పోయి తాగొచ్చిన భర్తనే చిపిరికట్ట తిరగేసి కొట్టే రోజులొచ్చేశాయి. అయితే, ఈవిడ మాత్రం తన తాగుబోతు భర్తకు కాస్త డిఫరెంట్‌గా ట్రీట్‌మెంట్ ఇచ్చింది. కొత్తగా ట్రై చెయ్యాలనుకుందేమో కానీ మంచంపై పడుకున్న భర్తపై ఏకంగా మరిగే వేడి నీళ్లు పోసేసింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని చిట్టి నగర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త దుర్గారావు రోజు తాగొచ్చి వేధిస్తున్నాడని, ఎలాగైనా అతనికి బుద్ది చెప్పాలనుకున్న భార్య.. తాగొచ్చి మంచంపై ఆదమరచి నిద్రపోతున్న భర్తపై ఏకంగా సలసల కాగిన వేడి నీళ్ళను పోసేసింది. ఈనెల 27వ తేదీన గొడవ పడిన బార్యా భర్తలు మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. దాంతో భార్య శ్రావణిపై పోలీసులకు పిర్యాదు చేసాడు భర్త దుర్గా రావు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు దుర్గారావు ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా వుంది. దాదాపు 40 శాతం ఒళ్ళంతా కాలిపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విశాఖలో మరోసారి మత్స్యకారుల ఆందోళన..
ఇదిలాఉంటే.. విశాఖ కంటైనర్ టెర్మినల్ వద్ద మత్స్యకారులు మరోసారి ఆందోళనకు దిగారు. గతంలో తమ వద్ద తీసుకున్న భూములకు పరిహారం చెల్లించకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హామీ ప్రకారం ఇంటికొక ఉద్యోగం, 60 గజాల ఇల్లు, స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా కంటైనర్ గేటు వద్ద మత్స్యకారులు నిరసనకు దిగారు. ఉద్యోగులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వారిని అదుపు చేసేందుకు పోలీసులు భారీగా రంగంలోకి దిగారు. డిమాండ్లు పరిష్కరించకుంటే వినిపించకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నారరు మత్స్యకారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..