AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Newly Married: కొత్త జంట మధ్య చిచ్చురేపిన సెల్‌ఫోన్‌.. మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య

మరో వనవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లి జరిగి నిండా నాలుగు నెలలు కూడా నిండలేదు. అంతలోనే నూరేళ్లు నిండాయి.

Newly Married: కొత్త జంట మధ్య చిచ్చురేపిన సెల్‌ఫోన్‌.. మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య
Jyothi Gadda
|

Updated on: Jun 15, 2022 | 10:31 AM

Share

మరో వనవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటు చేసుకుంది. పెళ్లి జరిగి నిండా నాలుగు నెలలు కూడా నిండలేదు. అంతలోనే నూరేళ్లు నిండాయి. కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. సెల్‌ఫోన్‌ కారణంగా జరిగిన గొడవ ఆ నవ వధువు ప్రాణాలు బలితీసుకుంది. కలుపు మందు తాగి చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. యువతి మృతితో అటు పుట్టింటివారు, ఇత్తింటి వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

కృష్ణా జిల్లా తోట్ల వల్లూరు మండలంలోని భద్రిరాజుపాలెం గ్రామానికి చెందిన రత్నకుమారి(19)కి, ఉంగుటూరు మండలం నందమూరు గ్రామానికి చెందిన పేటేటి సన్నీకి ఈ ఏడాది ఫిబ్రవరి 18న వివాహం జరిగింది. అంతలోనే ఇద్దరి మధ్య సెల్‌ఫోన్‌ కారణంగా వివాదం రాజుకుంది. చిన్నపాటి గొడవతో భార్య భర్తలిద్దరూ వాగ్వాదానికి దిగారు. దీంతో మనస్తాపం చెందిన రత్నకుమారి ఇంటి ఆవరణలో ఉన్న కలుపు మందు తాగేసింది. దాంతో అపస్మారక స్ధితిలోకి వెళ్లింది. అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందింది.

రత్నకుమారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పెళ్లయి నాలుగు నెలలు కూడా నిండక ముందే తమ కూతురు మృతిచెందటం ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. వారిని ఓదార్చటం ఎవరివల్ల కాలేదు. మృతురాలి తండ్రి యోహాను ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి