Andhra Pradesh: కొరినట్లే డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్! మరి ఆ ఇద్దరు నేతలు సంతృప్తి చెందేనా?!

ఎట్టకేలకు ఒంగోలుకు కొత్త డీఎస్పీని వేశారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌పై మాజీ మంత్రి బాలినేని అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు విజయనగరంలోనూ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరాలతో డీఎస్పీ మారిపోయారు. తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీలో ఈ రెండు మార్పులే అటెన్షన్‌ తీసుకొచ్చాయి. అవును, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో డీఎస్పీల..

Andhra Pradesh: కొరినట్లే డీఎస్పీలు ట్రాన్స్‌ఫర్! మరి ఆ ఇద్దరు నేతలు సంతృప్తి చెందేనా?!
Dsp Officers
Follow us
Shiva Prajapati

|

Updated on: May 07, 2023 | 8:14 AM

ఎట్టకేలకు ఒంగోలుకు కొత్త డీఎస్పీని వేశారు. ఇక్కడ డీఎస్పీ పోస్టింగ్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అటు విజయనగరంలోనూ మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరాలతో డీఎస్పీ మారిపోయారు. తాజాగా జరిగిన డీఎస్పీల బదిలీలో ఈ రెండు మార్పులే అటెన్షన్‌ తీసుకొచ్చాయి. అవును, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి పెద్ద సంఖ్యలో డీఎస్పీల బదిలీలు చేపట్టారు. మొత్తం 50 మందికి స్థాన చలనం అయ్యింది. వెయింటింగ్‌లో ఉన్న పలువురికి పోస్టింగ్‌లు ఇచ్చారు. వీటిల్లో ఒంగోలు, విజయనగరం సబ్‌డివిజనల్‌ పోలీస్‌ ఆఫీసర్ల పోస్టులు కూడా ఉన్నాయి.

కొద్దిరోజులుగా ఒంగోలు డీఎస్పీ పోస్టింగ్‌పై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాను సూచించిన అధికారికి కాకుండా వైవీ సుబ్బారెడ్డి సిఫారసుతో అశోక్‌వర్ధన్‌ డీఎస్పీగా వచ్చారనేది బాలినేని ఆరోపణ. అదే అంశాన్ని సీఎం జగన్‌ దగ్గర కూడా మాజీ మంత్రి ప్రస్తావించారు. ఇదే సమయంలో ఒంగోలు డీఎస్పీగా ఛార్జ్ తీసుకుని వెంటనే వెళ్లిపోయారు అశోక్‌వర్ధన్‌. తాజా బదిలీల్లో అశోక్‌వర్ధన్‌ను దర్శికి ట్రాన్స్‌ఫర్‌ చేసి.. అక్కడ పనిచేస్తున్న నారాయణస్వామిరెడ్డిని ఒంగోలు కొత్త డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. ఈ మార్పుపై బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ కేడర్‌లో నెలకొంది.

విజయనగరం కొత్త డీఎస్పీగా గోవిందరావుకు పోస్టింగ్‌..

ఇక విజయనగరం డీఎస్పీ బదిలీ కూడా డిపార్ట్‌మెంట్‌తోపాటు రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది. మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరాలతో అక్కడ కాళిదాస్‌ను బదిలీ చేశారు. కాళిదాస్‌ను నార్త్‌ కోస్టల్‌ సెక్యూరిటీ డీఎస్పీగా ట్రాన్స్‌ఫర్‌ చేస్తే.. విజయనగరం కొత్త డీఎస్పీగా ఆర్ గోవిందరావుకు పోస్టింగ్‌ ఇచ్చారు. మొత్తానికి అటు బాలినేని.. ఇటు బొత్స అభ్యంతరాలతో డీఎస్పీల బదిలీలు తప్పలేదనే టాక్‌ నడుస్తోంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో డీఎస్పీల బదిలీలను కీలకంగా భావిస్తున్నారు అధికారపార్టీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?