ఇదేం పని పెద్దాయనా..! 60 ఏళ్ల వయసులో వరుస చోరీలకు పాల్పడుతోన్న వృద్ధుడు అరెస్ట్

వయసు 60.. దొంగతనాల్లో మాత్రం చేయితిరిగిన కేటుగాడు. పలు కేసుల్లో పట్టుబడి కటకటాలపాలైన తీరుమారలేదు. వ్యసనాల ద్యాసలో పడి వయసు మీద పడుతుతోన్నా తీరుమార్చుకోకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు..

ఇదేం పని పెద్దాయనా..! 60 ఏళ్ల వయసులో వరుస చోరీలకు పాల్పడుతోన్న వృద్ధుడు అరెస్ట్
West Godavari Crime
Follow us

|

Updated on: May 07, 2023 | 7:03 AM

వయసు 60.. దొంగతనాల్లో మాత్రం చేయితిరిగిన కేటుగాడు. పలు కేసుల్లో పట్టుబడి కటకటాలపాలైన తీరుమారలేదు. వ్యసనాల ద్యాసలో పడి వయసు మీద పడుతుతోన్నా తీరుమార్చుకోకుండా వరుస చోరీలకు పాల్పడుతున్నాడు. ఎట్టకేలకు శనివారం పోలీసులకు పట్టుబడ్డాడు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ఎస్పీ కార్యాలయంలో కొత్తపేట డీఎస్పీ కె వెంకటరమణ వెల్లడించిన వివరాల ప్రకారం..

పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం బొబ్బనపల్లికి చెందిన కట్టా సుబ్బారావు(60) రాత్రి సమయాల్లో చోరీలకు పాల్పడేవాడు. ఇళ్లు, ఊరు చివర ఉండే ఆలయాలను టార్గెట్‌ చేసేవాడు. గుట్టుచప్పుడు కాకుండా పనికానిచ్చేవాడు. ఇలా పశ్చిమగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో అతనిపై ఇప్పటికే 23 కేసులు నమోదయ్యాయి. గతంలో వీరవాసరం పోలీసులు అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఐతే బయటికి వచ్చాక తీరుమార్చుకోని సుబ్బారావు మళ్లీ దొంగతనాల బాట పట్టాడు. ఈ క్రమంలో హైవేపై దిండి గ్రామంలో పోలీసులు సుబ్బారావును అదుపులోకి తీసుకుని దాదాపు రూ.47.18లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కె వెంకటరమణ మీడియా సమావేశంలో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.