Andhra Pradesh: సొంత మామకు కోటి రూపాయల బీమా చేయించాడు.. ఆ తర్వాత చేసిన పనికి
వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసం సొంత మామనే ఓ వ్యక్తి హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులో యరవల చెన్నకృష్ణారెడ్డి(59), లక్ష్మీ ప్రసన్న దంపతులు ఉంటున్నారు.
వైఎస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. బీమా డబ్బుల కోసం సొంత మామనే ఓ వ్యక్తి హత్య చేయడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే ప్రొద్దుటూరులో యరవల చెన్నకృష్ణారెడ్డి(59), లక్ష్మీ ప్రసన్న దంపతులు ఉంటున్నారు. అయితే వాళ్ల పెద్ద కూతురుని సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామానికి చెందిన రాయపాటి కిరణ్ రెడ్డికి ఇచ్చి పెండ్లి చేశారు. అయితే కొన్నాళ్ల తర్వాత కిరణ్ రెడ్డి తన మామ చెన్నకృష్ణారెడ్డికి కోటి రూపాయల జీవిత బీమా చేయించాడు. అలాగే పత్రాల్లో నామినీగా తన పేరునే నమోదు చేయించాడు. 2019లో జనవరి 30న కిరణ్ రెడ్డి తన స్నేహితుడు మల్లె శ్రీనివాసులరెడ్డితో కలిసి మామ చెన్నకృష్ణారెడ్డిని కారులో ఎక్కించుకొని తీసుకెళ్లాడు.
దారిలో వెళ్తుండగానే మిత్రుడితో కలిసి కిరణ్ రెడ్డి మామను హతమార్చారు. అనంతరం ప్రొద్దుటూరు సమీపంలోని పోట్లదుర్తి వద్ద రోడ్డుపై విసిరేసారు. అయితే ఈ ఘటనను ప్రమాదకరంగా చిత్రీకరించే ప్రయత్నం చేసినప్పటికీ… అక్కడున్న స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులిద్దర్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అయితే ఈ క్రమంలోనేవైయస్‌ఆర్ జిల్లా ప్రొద్దుటూరు రెండో అదనపు జిల్లా న్యాయస్థానం నేరస్థులకు జీవిత ఖైదు విధించింది. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.11 లక్షల చొప్పున జరిమాన కూడా విధించింది. ఒకవేళ చెల్లించకపోతే మరో ఎనిమిది సంవత్సరాలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..