Nara Lokesh: నెల్లూరులో పాదయాత్రను ప్రారంభించిన లోకేష్.. యువనేతకు మహిళలు హారతులతో నీరాజనాలు
యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ ప్రారంభించారు. లోకేష్ కు దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. దారులన్నీ పసుపు పూల వనాన్ని తలపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హడావిడి ఇప్పటికే మొదలైంది. అధికార, ప్రతి పక్ష నేతలు ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలపై దృష్టిని సారించారు. టీడీపీ నేత నారా లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు జిల్లా వరకు జరగనున్న సంగతి తెలిసిందే. తాజాగా యువగళం పాదయాత్ర 144వ రోజు నెల్లూరు రూరల్ కాకుపల్లి క్యాంప్ సైట్ నుంచి నారా లోకేష్ ప్రారంభించారు. లోకేష్ కు దారిపొడవునా మహిళలు హారతులతో నీరాజనాలు పలికారు. దారులన్నీ పసుపు పూల వనాన్ని తలపిస్తున్నాయి.
నారా లోకేష్ నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి చేరుకున్నారు. తమ యువత నేత నెల్లూరులోకి అడుగు పెట్టగానే నగరం జనసంద్రంగా మారింది. తమ నేతకు నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన దరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సహా టీడీపీ కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలికారు.
లోకేష్ కు భారీ స్థాయిలో కళాకారులు డ్యాన్స్ , తమ కళలను ప్రదర్శిస్తూ తమ నియోజకవర్గంలోకి స్వాగతించారు. పాట కచేరీలు, తప్పెట్లు, కేరళ వాయిద్యాలతో హోరెత్తించారు. ఇక.. వైసీపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి టీడీపీలో చేరకముందే బల ప్రదర్శన చేశారు
లోకేష్ చేస్తోన్న పాదయాత్రకు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ఉత్సాహంగా ముందుకు సాగుతున్నారు. కుప్పం నుంచి లోకేష్ మొదలు పెట్టిన పాదయాత్ర 400 రోజులు పాటు, 4వేల కిలో మీటర్లు జరగనుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..