AP Politics: నారా లోకేష్‌కు మంత్రి రజిని సవాల్.. కోపంతో ఊగిపోయిన మినిస్టర్
టీడీపీ యువనేత నారా లోకేష్‌పై ఏపీ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై లోకేష్ పదేపదే ఆరోపణలు చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరోగ్య భద్రత కల్పించడంపై లోకేష్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

యువగళం పాదయాత్రలో నారా లోకేష్…ఆరోగ్యశ్రీ అమలుపై పదే పదే ఆరోపణలు చేయడంపై మంత్రి విడదల రజినీ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీపై మాట్లాడే అర్హత చంద్రబాబు, లోకేష్‌కు లేదని విరుచుకుపడ్డారు. ఎవరి హయాంలో ఆరోగ్యశ్రీ ఎలా అమలైందో చంద్రబాబు, లోకేష్ చర్చకు రావాలని సవాల్ విసిరారు మంత్రి విడదల రజిని. తెలుగుదేశం పార్టీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని మంత్రి రజిని విమర్శించారు. అంతేకాదు ఆరోగ్యశ్రీని వెంటిలేటర్‌పై ఉంచారని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిన వారి పేరైనా లోకేష్ చెప్పగలరా? అని ఆమె ప్రశ్నించారు. 3257 ప్రొసీజర్స్‌ను ఆరోగ్యశ్రీలో చేర్చిన క్రెడిట్ ముఖ్యమంత్రి జగన్‌దేన్నారు మంత్రి రజిని.
ఇక టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీ కనీసం వెయ్యికోట్లు ఖర్చు పెట్టలేదని మంత్రి విడదల రజిని విమర్శించారు. కానీ..వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఒక్క ఏడాదిలోనే 3,400 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టామన్నారు. మొత్తం నాలుగేళ్లలో 10,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తెలిపారు. వార్షికాదాయం 5 లక్షలు ఉన్న వారికి కూడా ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. ఇక మొత్తం 2275 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తున్నామని మంత్రి రజినీ తెలిపారు.
మొత్తానికి ఆరోగ్యశ్రీపై లోకేష్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఎటాక్ చేశారు మంత్రి విడదల రజిని. మరి…మంత్రి రజినీ సవాల్‌ను లోకేష్ స్వీకరిస్తారా..? వేచి చూడాలి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..