AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janasena: ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చేప్పేస్తాం.. అక్కడి నుంచే నా పోటీ..: నాదెండ్ల మనోహర్

Janasena Party: వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే బిజెపి మాత్రం ఇప్పటికీ తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..? అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో అధికార వైసిపి నేతలు

Janasena: ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో చేప్పేస్తాం.. అక్కడి నుంచే నా పోటీ..: నాదెండ్ల మనోహర్
Nadendla Manohar
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 07, 2023 | 12:19 PM

Share

గుంటూరు, ఆగస్టు 07: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ,  జనసేన, తెలుగు దేశం పార్టీల మధ్య పొత్తు ఉంటుందా..? లేదా ..? అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని గద్దె దించేందుకు మూడు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని పవన్ కల్యాణ్ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. అయితే బిజెపి మాత్రం ఇప్పటికీ తమకు జనసేనతో మాత్రమే పొత్తు ఉందని చెప్పుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది..? అసలు పొత్తు ఉంటుందా లేదా అన్న అంశాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తుంది. ఇదే సమయంలో అధికార వైసిపి నేతలు పవన్ కల్యాణ్, చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ ప్రశ్నలు గుప్పిస్తున్నారు.

మరోవైపు జనసేనలో నంబర్ 2 నేతగా కొనసాగుతోన్న మాజీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే నాదేండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు ఈ చర్చలకు కొంత మేరకు స్పష్టత ఇచ్చాయి. గుంటూరులోని పార్టీ కార్యాయలంలో మీడియాతో మాట్లాడిన ఆయన మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే స్షష్టత ఇస్తామని అన్నారు. అప్పటి వరకూ మీడియా ప్రతినిధులు కూడా వేచి ఉండాలన్నారు. మనోహర్ చెప్పిన సమాధానంతో మొత్తం మీద పొత్తు ఉంటుందని జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయట్లేదని ఆయన చెప్పకనే చెప్పారు. అదే విధంగా కొన్ని రోజుల క్రితం జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విధంగానే వచ్చే ఎన్నికల్లో తాను తెనాలి నుండే బరిలోకి దిగుతున్నట్లు మనోహర్ తెలిపారు.

అదే విధంగా డేటా చోరిపై పవన్ కల్యాణ్ మాట్లాడుతుంటే మంత్రులు విమర్శలు చేస్తున్నారన్నారు. సిఎంవోనే డేటా చౌర్యం జరిగితే ఎందుకు పట్టించుకోవడం లేదన్ని ఈ సందర్భంగా మనోహర్ ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా జనసేనని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జరుగుతున్న నష్టాలను పవన్ ప్రజలకు వివరిస్తున్నందుకే వాని ద్వారా కేసులు పెట్టిస్తున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు అన్ని ప్రయత్నా  చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే చెప్పేస్తామన్నారు. ఇలా బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తులుంటాయని అన్ని స్థానాల్లో పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేయదనే సంకేతాలిచ్చారు మనోహర్. దీనిపై అటు పార్టీలోనూ ఇటు బయట కూడా చర్చ నడుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..