Andhra Pradesh: అధికారమే లక్ష్యంగా నాయకుల కొత్త ఎత్తుగడ.. అందుకేనా ఈ కొత్త మకాంలు
ప్రజలకు ఇచ్చిన మాట కోసం వారికి నమ్మకం కలిగించేలా ముందుకెళ్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ తన నివాసాన్ని అమరావతితో పాటు విశాఖలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం సొంత నియోజకవర్గం కుప్పంలో కొన్ని కొన్ని రోజులపాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తన మకాంను అమరావతికి మార్చేశారు. మూడు పార్టీల అధినేతలు కొత్తగా ఇళ్ల నిర్మాణాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్...

ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతుంది.ఎన్నికలకు ఇంకా 9 నెలలు ఉండగానే అధికారం కోసం నేతల్లో పట్టు పెరిగింది. ప్రజల్లో తమపై నమ్మకం కలిగించేందుకు ఎవరికివారు ప్రయత్నాల్లో ఉన్నారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు ఎన్నికలకు వెళ్తుండగా మూడు రాజధానులతో రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు వైఎస్సార్సీపీ చెబుతుంది. విశాఖపట్నంను పాలనారాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు ఏదో ఒక బ్రేక్ పడుతుంది. అయితే కీలక నేతలు మాత్రం తమ మకాంలు మార్చేందుకు వేగంగా ముందుకెళ్తున్నారు.
ప్రజలకు ఇచ్చిన మాట కోసం వారికి నమ్మకం కలిగించేలా ముందుకెళ్తున్నారు. త్వరలో ముఖ్యమంత్రి జగన్ తన నివాసాన్ని అమరావతితో పాటు విశాఖలో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సైతం సొంత నియోజకవర్గం కుప్పంలో కొన్ని కొన్ని రోజులపాటు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తన మకాంను అమరావతికి మార్చేశారు. మూడు పార్టీల అధినేతలు కొత్తగా ఇళ్ల నిర్మాణాల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చే అక్టోబర్ నాటికి విశాఖ వెళ్లేందుకు ఇప్పటికే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం వేగంగా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వచ్చే అక్టోబర్ 24 నుంచి తన మకాంను విశాఖపట్నంకు మార్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
అక్కడే తన క్యాంప్ కార్యాలయంతో పాటు ఇళ్లు కూడా నిర్మించుకుంటున్నారు. ఋషికొండ సమీపంలో ఆఫీస్ భవనాలు, ఇంటిని సీఎం జగన్ కోసం నిర్మిస్తున్నారు. మూడు రాజధానులు అంటున్న సీఎం జగన్. ముందుగా సీఎంవోను విశాఖపట్నంకు మార్చే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లో నాలుగు రోజులపాటు ఉండి మూడు రోజులు పాటు అమరావతిలో ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాలుగు రోజులు విశాఖలో ఉంటారా లేక ఎన్నిరోజులు ఉంటారనేది త్వరలో స్పష్టత రానుంది.




ఇక అటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై తాత్కాలిక నివాసంలో ఉంటున్నారు. హైదరాబాద్‌లో రెండేళ్ల క్రితం కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. అయితే తనను వరుసగా అసెంబ్లీకి పంపిస్తున్న కుప్పం నియోజకవర్గం ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో అక్కడ కూడా సొంత ఇంటిని నిర్మించుకుంటున్నారు చంద్రబాబు. ఇటీవలే ఈ ఇంటి నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో అధికారం వచ్చినా నియోజకవర్గంలో మాత్రం నెలలో కొన్ని రోజులు గడిపేలా కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.
మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా తన మకాం పూర్తిగా అమరావతికి మార్చేశారు. పార్టీపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంతో పాటు అమరావతి నుంచే రాజకీయం చేస్తానని ప్రకటించారు. హైదరాబాద్‌లో ఉన్న పార్టీ కార్యాలయ సిబ్బంది, సామగ్రిని కూడా మంగళగిరి పార్టీ కార్యాలయానికి తరలించారు. ఏదైనా అవసరం ఉంటే తప్ప హైదరాబాద్ వెళ్లకూడదని నిర్ణయించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యాలయం కోసం శాశ్వత భవనం నిర్మాణం జరుగుతుంది. ఇదే భవనంలో తనకూ పర్మనెంట్ గా ఉండేలా ప్రత్యేకంగా ఒక బ్లాక్ నిర్మిస్తున్నట్లు తెలిసింది. మొత్తంగా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రజల దృష్టిని తమవైపు మళ్లించుకునేలా ఆయా పార్టీల అధినేతలు ప్రయత్నాలు వేగవంతం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..




