Visakhapatnam: విశాఖలో దారుణం.. ఉదయాన్నే బీచ్‌కు వెళ్లిన లవర్స్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ప్రేమించిన మహిళను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం నగరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ దుర్మార్గుడు ప్రేమించిన మహిళను దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పరవాడకు చెందిన యువకుడు ఓ మహిళను దారుణంగా హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. మహారాణిపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరవాడకు చెందిన యువకుడు గోపాలకృష్ణ, వివాహిత శ్రావణి కలిసి శనివారం ఉదయం గోకుల్ పార్క్ బీచ్‌కు వెళ్లారు. అక్కడ ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య ఏదో విషయంలో గొడవ జరిగింది.
ఈ సమయంలో తీవ్ర కోపోద్రికుడైన గోపాలకృష్ణ.. ప్రియురాలు శ్రావణిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మహిళ మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతురాలు జగదాంబ కూడలిలోని ఓ షాపింగ్ మాల్‌లో పని చేస్తున్న శ్రావణిగా పోలీసులు గుర్తించారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, వీరిద్దరికీ ఎప్పటినుంచి పరిచయం ఉంది.. గోపాలకృష్ణకు హత్య చేయాల్సిన అవసరం ఏమోచ్చింది..? అసలేం జరిగిందన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
అయితే, శ్రావణి హత్య అనంతరం గోపాలకృష్ణ గాజువాక పోలీసులు ఎదుట లొంగిపోయాడు. నిందితుడ్ని డీసీపీ విద్యాసాగర్ నాయుడు విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..