Vijayawada: ట్రేడ్ ప్రాజెక్టులతో లక్షలు వస్తాయంటే నమ్మింది తను.. కానీ పాపం..

ప్రజంట్ సొసైటీలో ఎవర్ని నమ్మాలో, ఎవర్ని నమ్ముకూడదో అస్సలు అర్థం కావడం లేదు. సైబర్ మాయగాళ్లు రోజురోజుకు చెలరేగిపోతున్నారు. ఎంత అలెర్ట్‌గా ఉన్నా.. ఏదో ఒక రకంగా బురిడీ కొట్టిస్తున్నారు.

Vijayawada: ట్రేడ్ ప్రాజెక్టులతో లక్షలు వస్తాయంటే నమ్మింది తను.. కానీ పాపం..
Money
Follow us

|

Updated on: May 20, 2023 | 4:16 PM

ప్రభుత్వం, పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సైబర్‌ నేరగాళ్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఏదో ఒక రూపంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు ఈ సైబర్‌ కేటుగాళ్లు. తాజాగా విజయవాడకు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిణికి పార్ట్‌టైమ్‌ జాబ్‌ పేరుతో వల విసిరారు. ట్రేడ్‌ ప్రాజెక్టులు కొనుగోలు చేయడం ద్వారా లక్షల్లో సంపాదించవచ్చని నమ్మబలికారు. కేటుగాళ్ల మాటలు నమ్మిన యువతి దఫదఫాలుగా 20 లక్షలవరకూ పెట్టుబడి పెట్టింది. ఎప్పటికీ డబ్బు చెల్లించకపోవడంతో సదరు వ్యక్తులను నిలదీసింది. వారినుంచి ఎటువంటి స్పందనా లేకపోవడంతో చేసది లేక పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న విజయవాడ సైబర్‌ క్రైం పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదే తరహా ఆఫర్స్ ఈ మధ్య చాలామందికి వస్తున్నాయి. ఫోన్‌కి ఒక మెసేజ్ వస్తుంది. చిన్న టాస్క్‌ కంప్లీట్ చేస్తే.. డబ్బలిస్తామని ఊరిస్తారు. నమ్మించిడానికి తొలి రెండు, మూడు టాస్కులకు డబ్బులు వెంటనే ఇచ్చేస్తారు. ఇంకే బోలెడంత డబ్బు వస్తుంది కదా అని చాలా డబ్బు ఇన్వెస్ట్ చేస్తారు కొందరు. అలా అడ్డంగా బుక్కవుతారు. ఇలాంటి మెసేజులు వస్తే అస్సలు రెస్పాండ్ అవ్వకండి. ఖర్మ కాలి ఆ లింక్ క్లిక్ చేస్తే.. మీ ఖాతా ఖల్లాస్ అంతే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..