AP Politics: నెల్లూరులో చల్లారని పొలిటికల్ హీట్.. హాట్ టాపిక్‌గా మారిన ఎంపీ వేమిరెడ్డి ఫ్లెక్సీల తొలగింపు..
Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)ల
Nellore Politics: నెల్లూరు జిల్లా రాజకీయాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. అధికార పార్టీ వైసీపీకి చెందిన మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి( Kakani Govardhan Reddy), మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav)ల మధ్య ఆధిపత్య పోరు ముదిరి పాకాన పడుతోంది. వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇటీవల కాకాణి మొదటి సారిగా నెల్లూరు జిల్లాకు రావడం, అదే రోజు ‘ఆత్మీయ సభ’ పేరుతో అనిల్ పోటీగా బహిరంగ సభ చేపట్టడంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు వేడేక్కాయి. ఇక మంత్రి నియోజకవర్గం సర్వేపల్లి గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారీ కాన్వాయ్ తో వచ్చారు అనిల్ కుమార్. అంతేకాదు సర్వేపల్లిలో అనిల్ అనుచరులు బాణాసంచా కాల్చి నానా హంగామా చేశారు. కాగా తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy)ఫ్లెక్సీల తొలగింపు నెల్లూరులో హాట్‌టాపిక్‌గా మారింది.
ఎంపీ జన్మదినం సందర్భంగా నెల్లూరు జిల్లా అంతటా ప్రభాకర్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారు. అయితే నెల్లూరు సిటీ పరిధిలో చాలా చోట్ల వేమిరెడ్డి ఫ్లెక్సీలు తొలగించారు. అదే సమయంలో నెల్లూరు రూరల్ పరిధిలో యథావిధిగా ఫ్లెక్సీలు ఉన్నాయి. మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కావాలనే ఈ ఫ్లెక్సీలు తొలగించినట్లు చర్చ నడుస్తోంది. కాగా కొన్ని రోజుల క్రితం మంత్రి కాకానీ ఫ్లెక్సీలను అనిల్ అనుచరులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అనిల్ అనుచరులే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. కాగా ఈ వ్యవహారంపై ఎంపీ వేమిరెడ్డి వర్గం సీరియస్‌గా ఉంది.
Also Read: Vijay Devarakonda- Samantha : సమంత -విజయ్ దేవరకొండ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్.. అదేంటంటే Rupee: బలహీనపడిన భారత కరెన్సీ.. డాలర్‌తో పోలిస్తే 10 పైసలు తగ్గిన రూపాయి..