AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

13 సిక్సర్లు, 10 ఫోర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలో అతడొక బ్రేకుల్లేని బుల్డోజర్..

ధనిక లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు అభిమాన గణం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు.

13 సిక్సర్లు, 10 ఫోర్లు తుఫాన్ ఇన్నింగ్స్‌తో బౌలర్ల ఊచకోత.. ఐపీఎల్ చరిత్రలో అతడొక బ్రేకుల్లేని బుల్డోజర్..
Ipl 2022
Ravi Kiran
|

Updated on: Apr 18, 2022 | 7:43 PM

Share

ధనిక లీగ్‌గా పేరొందిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు అభిమాన గణం అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ లీగ్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే దేశీయ, విదేశీ క్రికెటర్లు ఈ టోర్నమెంట్‌లో పాలుపంచుకుంటున్నారు. ఈ లీగ్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ డబ్బు, కీర్తి, హోదా వస్తాయి. అంతటి పెద్ద క్రికెట్ లీగ్ ‌అయిన ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18 ఏప్రిల్ 2008న ప్రారంభమైంది. లలిత్ మోడీకి వచ్చిన ఒక్క ఆలోచన.. ఈ లీగ్‌గా రూపుదిద్దుకుంది. ఇప్పుడు బీసీసీఐకి కోట్ల వర్షం కురిపిస్తోంది. నేటికి 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ లీగ్ ఎన్నో ఎత్తుపల్లాలను చవి చూసుకుంది. పలు టీమ్స్ వచ్చి.. అలా వెళ్ళిపోతే.. మరికొన్ని లీగ్ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయాయి. వీటన్నింటి మధ్య, ఐపీఎల్‌లో ఇప్పటికీ దేశవిదేశాలకు చెందిన ప్లేయర్స్ పాల్గొనాలని ఉత్సాహాన్ని చూపిస్తుంటారు.

2008 ఐపీఎల్ మొదటి మ్యాచ్ గురించి విషయానికొస్తే.. తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న బెంగళూరు బౌలర్లపై న్యూజిలాండ్ ప్లేయర్ వీరవిహారం చేశాడు. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ KKR తరపున 13 సిక్సర్లు, 10 ఫోర్లతో 158 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. మైదానం నలుమూలల బౌండరీలతో బెంగళూరు బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 140 పరుగుల తేడాతో ఘోర ఓటమి పాలైంది. ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో ఇదొక తుఫాన్ ఇన్నింగ్స్.. ఆ తర్వాత్ గేల్ 175 మరో అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు.

Follow Us
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్..? ఇండియాలో కొత్త ట్రెండ్‌
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
రైల్వేశాఖ కీలక నిర్ణయం.. అన్ని రైల్వే స్టేషన్లలో..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
కాకినాడ చిన్నారి మిస్సింగ్‌ కేసులో ట్విస్ట్.. 3రోజు తర్వాత..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
చేసింది అన్నీ విలన్ పాత్రలే.. అయినా క్రేజ్ ఎక్కువే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
ఫ్రెండ్స్ నుంచి డబ్బులు తీసుకుంటున్నారా..? ఐటీ రూల్స్ ఇవే..
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
సిండికేట్ ఉచ్చులో రొయ్య సాగు.. దిక్కుతోచని స్థితిలో ఆక్వా రైతు
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
చిన్నప్పుడు చాలా అల్లరి పిల్లోడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
మరణం తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? గరుడ పురాణం చెప్పిన..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
జీలకర్ర నీరు లేదా వాము నీరు.. ఖాళీ కడుపుతో తాగేందుకు ఏది బెస్ట్..
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!
ఆరోగ్యంగా ఉండటానికి ఏసీ టెంపరేచర్ ఎంత ఉండాలంటే!