Viveka Murder Case: వివేకా హత్య రోజు అసలేం జరిగిందంటే? వీడియో విడుదల చేసిన ఎంపీ అవినాష్
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డికి బెయిల్ రద్దు తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్‌కి సంబంధించి తన వెర్షన్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి.

మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో గంగిరెడ్డికి బెయిల్ రద్దు తర్వాత మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మర్డర్‌కి సంబంధించి తన వెర్షన్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. ఇందులో అసలు వివేకా హత్య రోజు ఏం జరిగింది? మర్డర్ తర్వాత ఎంపీకి కాల్ వెళ్లిందా? అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ చేస్తున్న ఆరోపణలు నిజమేనా? తదితర విషయాలపై తన వెర్షన్ వినిపించారు అవినాష్ రెడ్డి. ‘ శివప్రకాష్ రెడ్డి ((వివేకా బామ్మర్ది ) నాకు ఉదయం 6:30కి ఫోన్ చేశారు. నేను అప్పటికే జమ్మలమడుగుకు వెళ్తున్నా. సరిగ్గా పులివెందుల రింగ్‌రోడ్డులో ఉన్నప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. వివేకా నో మోర్ అని నాకు ఫోన్లో చెప్పారు. దీంతో వెంటనే నేను వివేకా ఇంటికి వెళ్లాను. వివేకా రాసిన లెటర్, ఫోన్ గురించి పీఏ కృష్ణారెడ్డి వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పారు. అయితే ఆ లెటర్, ఫోన్‌ను దాచమని రాజశేఖర్ రెడ్డి చెప్పారు. డ్రైవర్ ప్రసాద్‌ను వదిలిపెట్టొద్దని లేఖలో రాశారు వివేకా. ఈ మొత్తం మర్డర్ కేసులో ఆ లెటరే చాలా కీలకం. ప్రసాద్‌ను ఏమైనా అంటారేమో అని లేఖ దాచామని సునీత చెప్పారు. మీ నాన్నను కాకుండా డ్రైవర్ ప్రసాద్‌నే నమ్ముతారా? లెటర్ విషయాన్ని నాకు , పోలీసులకు చెప్పలేదు. ఆ లెటర్ విషయంపై CBI ఎందుకు ఫోకస్ చేయడం లేదు? ఎవరిని కాపాడేందుకు ఇదంతా చేస్తున్నారు? మర్డర్ అని తెలిసిన తర్వాత కూడా లెటర్ ఎందుకు దాచారు? మీ వైపు తప్పు ఉంది కాబట్టే ఆ లెటర్‌ను దాచారు. ఇదే విషయం నేను CBIకి చెప్పాను’ అని వీడియోలో చెప్పుకొచ్చారు అవినాష్ రెడ్డి.
కాగా వివేకా హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. అనంతరం తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేసిన హైకోర్టు మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ మే 5 వరకు లోంగిపోకుంటే గంగిరెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐను ఆదేశించింది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..