Ambati Rambabu: కోడెల ఆత్మహత్యకు కారణం చంద్రబాబే..! కామెంట్స్ చేసిన అంబటి రాంబాబు..
సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు దాదాపు 50-60 వేల మంది వచ్చారని టీడీపీ చేస్తున్న ప్రచారంలో బూటకమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిన్నటి సభ అట్టర్ ఫ్లాప్ షోగా ఆయన ఎద్దేవా చేశారు. జనం లేక చంద్రబాబు సభ వెలవెలపోయిందన్నారు.
సత్తెనపల్లిలో చంద్రబాబు సభకు దాదాపు 50-60 వేల మంది వచ్చారని టీడీపీ చేస్తున్న ప్రచారంలో బూటకమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిన్నటి సభ అట్టర్ ఫ్లాప్ షోగా ఆయన ఎద్దేవా చేశారు. జనం లేక చంద్రబాబు సభ వెలవెలపోయిందన్నారు. ఐదారుగురు అభ్యర్థులు పోగేస్తే కేవలం నాలుగైదు వేల మంది మాత్రమే చంద్రబాబు సభకు వచ్చారని అన్నారు. లేని జనాన్ని ఉన్నట్లు చెబుతున్నారని అన్నారు. విఠలాచార్య, రాజమౌళి దర్శకుల నుంచి నేర్చుకున్నట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. వారు సినిమాల్లో చూపించినట్లు.. టీడీపీ వాళ్లు కూడా లేని జనాన్ని ఉన్నట్లు గ్రాఫిక్స్‌తో చూపుతున్నారని ఎద్దేవా చేశారు.కాగా జగన్ రాజకీయాలకు అనర్హుడంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్‌కు అంబటి కౌంటర్ ఇచ్చారు. జనంరాని చంద్రబాబు, నారా లోకేష్‌లు అర్హులా? అంటూ ప్రశ్నించారు. సత్తెనపల్లి సభలో చంద్రబాబు అన్ని అబద్ధాలే మాట్లాడారని.. ఒక్క నిజం కూడా చెప్పలేదని ధ్వజమెత్తారు. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారిపోతారంటూ విమర్శించారు. కోడెల మరణానికి చంద్రబాబే కారణమని ఆరోపించిన అంబటి.. కోడెల కుటుంబానికి ద్రోహం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!