Avinash Reddy: అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్ట్‌.. విచారణను..

ఎంపీ అనివాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10:30 గంటలకు అందరి వాదనలు వింటామన్న హై కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే వాదనలకు ఎంత సమయం పడుతుందనీ సీబీఐని ముందు హైకోర్టు అడిగింది...

Avinash Reddy: అవినాష్‌ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై స్పందించిన హైకోర్ట్‌.. విచారణను..
Avinash Reddy
Follow us
Narender Vaitla

|

Updated on: May 25, 2023 | 6:45 PM

ఎంపీ అనివాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10:30 గంటలకు అందరి వాదనలు వింటామన్న హై కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే వాదనలకు ఎంత సమయం పడుతుందనీ సీబీఐని ముందు హైకోర్టు అడిగింది. గంట పాటు వాదనలు వినిపిస్తున్నామన్న సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణను రేపటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది.

ఇదిలా ఉంటే సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం వేసవి సెలవుల ప్రత్యే్క కోర్టులో పిటిషన్‌ను చేర్చిన విషయం తెలిసిందే. చివరి అంశంగా అవినాష్‌ బెయిల్‌ పిటిషన్‌ను చేర్చారు. వాదనలకు చాలా సమయం పడుతుందన్న నేపథ్యంలో విచారణను రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణ చేపట్టనున్నారు. శుక్రవారం వాదనలు విన్న తర్వాత బెయిల్ పిటిషన్‌పై తీర్పునిస్తామని న్యాయవాదులు తెలిపారు.

ఇదిలా ఉంటే వైఎస్‌ అవినాష్‌ పిటిషన్‌పై హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ విచారణ జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇక, అంతకుముందు ముందస్తు బెయిల్‌పై ఎంపీ అవినాష్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో విచారణ సందర్బంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ముందస్తు బెయిల్‌ కోరే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు స్పష్టం చేసింది. అవినాష్‌ పిటిషన్‌పై విచారణ చేసి ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..