Amaravathi: శుక్రవారం అమరావతి దగ్గర జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు..

ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం సిద్ధమౌవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయనున్నారు. వెంకట పాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి..

Amaravathi: శుక్రవారం అమరావతి దగ్గర జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు.. పూర్తి వివరాలు..
Amaravathi Nh Road
Follow us
Sanjay Kasula

|

Updated on: May 25, 2023 | 7:07 PM

అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ శుక్రవారం ప్రారంభం కానుంది. ఆర్ 5 జోన్ లో పట్టాల పంపిణీ కార్యక్రమం సిద్ధమౌవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పట్టాల పంపిణీ చేయనున్నారు. వెంకట పాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కన వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర జరగనున్న బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదికను 50 వేల మంది లబ్ధిదారులు, వాళ్ళ కుటుంబ సభ్యులు సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపిక చేసిన లబ్దిదారులకు లాంఛనంగా ఇళ్ళ పట్టాలు పంపిణీ చేయనున్నారు సీఎం జగన్. అమరావతి ప్రాంతంలో సుమారు 1400 ఎకరాల స్థలాన్ని పేదల ఇళ్ళ కోసం కేటాయించిన సంగతి తెలిసిందే.

శుక్రవారం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉన్నందున ట్రాఫిక్ మళ్లింపు చేపట్టామని గుంటూరు రేంజ్ ఐజీ పాలరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

గుంటూరు నుంచి విశాఖపట్నం వెళ్లే వాహనాలు బుడంపాడు మీదుగా తెనాలి, వేమూరు, కొల్లూరు, వెల్లటూరు, పెనుమూడి బ్రిడ్జి మీదుగ పామర్రు, గుడివాడ, హనుమాన్ జంక్షన్ మార్గంలో మళ్లించడం జరుగుతుందన్నారు.

సీఎం జగన్ కార్యక్రమ షెడ్యూల్ ఇలా..

సీఎం జగన్ శుక్రవారం రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీ పండుగకు భారీ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 9. 50 గంటలకు తుళ్ళూరు మండలం వెంకటపాలెంకు బయలుదేరుతారు. 10 గంటలకు వెంకటపాలెం చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన స్టాల్స్, ఫొటో ప్రదర్శనను 10. 45 గంటలకు లబ్ధిదారులతో సీఎం జగన్ మాట్లాడనున్నారు. అనంతరం 10. 55 నుంచి 11. 40 గంటల వరకు సభనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. 11. 40 గంటలకు ఇళ్ల పట్టాలను అందిస్తారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం