AP News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..

రాష్ట్రంలో సాధారణ ఉద్యోగుల బదిలీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

AP News: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్..
Andhra Grama Sachivalayam
Follow us

|

Updated on: May 25, 2023 | 5:15 PM

వైసీపీ ప్రభుత్వ మానస పుత్రిక అయిన సచివాలయాల్లో పనిచేసే  గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎం జగన్.  బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.  జూన్ 10 వరకు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం ఉంటుంది. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్ డిక్లేర్ అయిన ఉద్యోగులకు ట్రాన్స్‌ఫర్ అయ్యేందుకు వీలుంటుంది. జిల్లా పరిధిలో, అంతర్ జిల్లాల బదిలీలకు కూడా చాన్స్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.  పైరవీలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు ఉంటాయని వెల్లడించింది. బదిలీల ప్రక్రియను ప్రారంభించి వెంటనే చేపట్టాలని సీఎం ఆఫీసు నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ప్రొబేషన్‌ ఇస్తూ జగన్ సర్కార్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 2020 నోటిఫికేషన్‌లో ఎంపికైన వారికి ప్రొబేషన్‌ ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. శాఖాపరమైన పరీక్షలో పాసవ్వడంతో పాటు, 2 సంవత్సరాల సర్వీసు కంప్లీట్ చేసుకున్న వారికి ప్రొబేషన్‌ వస్తుందని ఉత్తర్వుల్లో  తెలిపారు. ఈ నేపథ్యంలో  మే 1వ తేదీ నుంచి ఉద్యోగులకు కొత్త పే స్కేళ్లు వర్తిస్తున్నాయి. తాజాగా బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వారికి డబుల్ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.

Ap News

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..