AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avinash Reddy: అవినాష్‌ రెడ్డి తల్లి హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. లక్ష్మమ్మ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారంటే?

ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంలో పురోగతి ఉందని, త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్‌ చేస్తామని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మరోసారి ఆమె హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు.

Avinash Reddy:  అవినాష్‌ రెడ్డి తల్లి హెల్త్‌ బులెటిన్‌ విడుదల.. లక్ష్మమ్మ ఆరోగ్యంపై వైద్యులు ఏమంటున్నారంటే?
Mp Avinash Reddy
Basha Shek
|

Updated on: May 25, 2023 | 3:12 PM

Share

ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ ఆరోగ్యంలో పురోగతి ఉందని, త్వరలోనే ఐసీయూ నుంచి షిఫ్ట్‌ చేస్తామని కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం మరోసారి ఆమె హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ‘శ్రీలక్ష్మి ఆరోగ్య పరిస్థితిలో పురోగతి ఉంటోంది. వాంతులు తగ్గాయి. ఐసీయూ నుంచి త్వరలో గదికి తరలించడానికి ప్లాన్ చేస్తున్నాం. గుండెకు రక్తం ససఫరా మెరుగుపరిచేందుకు ఆపరేషన్ అవససం లేని వైద్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఆమె నోటి నుండి ఆహారం తీసుకుంటోంది. అయోనోట్రోప్స్ కూడా నిలిపేశారు’ అని వైద్యులు తెలిపారు. కాగా గత వారం రోజులుగా కర్నూలు ఆస్పత్రిలో.. తల్లి దగ్గరే ఉంటూ.. ఆమె ఆరోగ్యపరిస్థితిని దగ్గరుండి చూసుకుంటున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. మరోవైపు ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కాసేపట్లో విచారణ ప్రారంభం కానుంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎంపీ అవినాష్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ను విచారించనుంది హైకోర్టు వెకేషన్ బెంచ్. తల్లి ఆరోగ్యం దృష్ట్యా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతోంది అవినాష్ టీమ్. మరోవైపు ఇదే పిటిషన్‌లో వైఎస్ కుమార్తె సునీతా రెడ్డి ఇంప్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఇరు వర్గాల వాదనల తర్వాత కోర్ట్ ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆసక్తిగా రేకెత్తుతుంది. న్యాయస్థానం తీర్పు ఆధారంగానే ముందుకు వెళ్లాలని సీబీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు హైకోర్టు తీర్పు తర్వాత అవినాష్‌ను అదుపులోకి తీసుకునేందుకు CBI అధికారులు వస్తారన్న ప్రచారంతో.. ఆస్పత్రి దగ్గరకు ఎంపీ అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది . కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రి దగ్గర హైటెన్షన్ నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం.. క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై