AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kakinada: కొడుకు కోడల్ని భరించలేను.. సారూ.. కారుణ్య మరణం ప్రసాదించండి.. జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన ఓ తల్లి

ఓ తల్లి..  తన కొడుకు, కోడలు తనపట్ల చూపిస్తున్న దాష్టీకాన్ని భరించలేను.. నాకు కారుణ్య మరణాన్ని వరంగా ఇప్పించండి.. మహా ప్రభో అంటూ.. ఓ ఎస్పీకి  విన్నపం చేసుకుంది

Kakinada: కొడుకు కోడల్ని భరించలేను.. సారూ.. కారుణ్య మరణం ప్రసాదించండి.. జిల్లా కలెక్టర్‌ను ఆశ్రయించిన ఓ తల్లి
Where Is Humanity
Surya Kala
|

Updated on: Jul 07, 2022 | 3:35 PM

Share

Kakinada: మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలే అని కారల్ మార్క్స్ చెప్పిన సిద్ధాంతాన్ని.. ఒక తల్లి వందమంది పిల్లలని ఏ లోటూ లేకుండా పెంచుతుంది.. కానీ ఒక్క తల్లిని ఆ వందమంది పిల్లలు ఆదరించరు అన్న పెద్దల మాటను నేటి తరంలోని చాలామంది పిల్లలు తూచా తప్పకుండా  పాటిస్తున్నారు. వృద్యాప్యంలో తల్లి భారం అంటూ.. వీధిపాలు చేస్తున్న సుతులు ఎందరో.. తాజా ఓ తల్లి..  తన కొడుకు, కోడలు   లు తనపట్ల చూపిస్తున్న దాష్టీకాన్ని భరించలేను.. నాకు కారుణ్య మరణాన్ని వరంగా ఇప్పించండి.. మహా ప్రభో అంటూ.. ఓ ఎస్పీకి  విన్నపం చేసుకుంది. ఈ దారుణ ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

కాకినాడ రూరల్ లోని గైగోలపాడుకు చెందిన అచ్చియ్యమ్మ అనే ఓ తనకు కారుణ్య మరణాన్ని ప్రసాదించమని అధికారులను వేడుకుంటుంది.  కారుణ్య మరణానికి అనుమతించాలని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబును కలిసి వినతి పత్రం ఇచ్చింది వృద్ధురాలు. తన చిన్న కుమారుడు, అతని రెండవ భార్య ప్రవర్తనపై విసుగు చెందానని.. ఇక తనకు బతకాలని లేదంటూ తెలిపింది. ఇటీవల చిన్నకుమారుడు, కోడలు అచ్చియ్యమ్మను ఇంట్లో నుండి గెంటేసి గేటుకు తాళం వేశారు. ఇదే విషయంపై వృద్ధురాలు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీంతో మనస్ధాపం చెందిన అచ్చియ్యమ్మ చనిపోవాలని నిర్ణయించుకుని.. అధికారులకు ఇష్టపూర్వక మరణం కోసం అర్జీ పెట్టుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..