Job Mela: నిరుద్యోగులకు అలర్ట్.. ఏపీలో భారీ జాబ్ మేళా.. 475 ఖాళీల భర్తీ.. ఇలా రిజిస్టర్ చేసుకోండి..
Job Mela: ప్రైవేటు కంపెనీల్లో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరచూ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని పలు జిల్లాల వారీగా...
Job Mela: ప్రైవేటు కంపెనీల్లో ఉన్న వివిధ పోస్టులను భర్తీ చేయడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APSSDC) తరచూ జాబ్ మేళాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలోని పలు జిల్లాల వారీగా ఈ జాబ్ మేళాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో భారీ జాబ్ మేళాకు సిద్ధమైంది. అరబిందో ఫార్మా కంపెనీలో ఏకంగా 475 ఖాళీల భర్తికీ ఇంటర్వ్యూలను నిర్హిస్తున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా రిజిస్టర్ చేసుకోవాలి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* జాబ్‌మేళాలో భాగంగా అబరిందో ఫార్మాలో డిపార్ట్‌మెంట్ క్యూసీ, ప్రొడక్షన్, ప్యాకింగ్, మెయింటెనెన్స్ విభాగాల్లో 475 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంఎస్సీ/బీఎస్సీ/ఎంఫార్మసీ/బీఫార్మసీ/డిప్లొమా స్టూడెండ్స్/ఇంటర్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
* 2018-22 వరకు పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న ఉన్న అభ్యర్థులు ముందుగా ఏపీఎస్‌ఎస్‌డీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
* రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు జూలై 11న ఉదయం 11 గంటలకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలి.
* అభ్యర్థులను టెక్నికల్ రౌండ్, హెచ్ఆర్ రౌండ్ ద్వారా ఎంపిక చేస్తారు.
* ఈ జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులు ఒంగోలు, ప్రకాశం జిల్లాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
* పూర్తి వివరాల కోసం 8639015530, 6301006979 నంబర్లను సంప్రదించండి.
@AP_Skill has Collaborated with #AurobindoPharma to Conduct Industry Customized Skill Training & Placement Program #PrakasamDistrict
Registration Link https://t.co/XnrotfY4b3
Contact: N. Venu Gopal: 86390 15530 Ms. R. Sai Praneetha – 6301006979 APSSDC Helpline : 99888 53335 pic.twitter.com/2WWqqpQmoA
— AP Skill Development (@AP_Skill) July 6, 2022
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..