Hyderabad: భాగ్యనగరం సిగలో మరో భారీ ప్రాజెక్ట్.. రూ. 1200 కోట్ల పెట్టుబడులు, 1000 మందికి ఉపాధి..
Safran Hyderabad: హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పాలసీల కారణంగా ప్రపంచదిగ్గజ కంపెనీలు భాగ్యనగరంలో పెట్టుబడులు...
Safran Hyderabad: హైదరాబాద్‌కు భారీ పెట్టుబడులు క్యూ కడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న పాలసీల కారణంగా ప్రపంచదిగ్గజ కంపెనీలు భాగ్యనగరంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ప్రముఖ ఏవియేషన్ సంస్థ సాఫ్రాన్ శంషాబాద్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ ఎంఆర్‌ఐ ఫెసిలిటీని గురువారం ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రామికి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై, ప్రారంభించారు.
సాఫ్రాన్ సంస్థ రాష్ట్రంలో రూ. 1200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీంతో సుమారు 800 నుంచి 1000 మందికి ఉపాధి లభించనుంది. ఫ్రెంచ్ దేశానికి చెందిన ఈ సంస్థ ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు అవసరమైన డిజైన్స్ చేస్తుంటుంది. సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థను ప్రారంభించిన తర్వాత మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..’పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణలో పరిశ్రమల కోసం అనువైన పాలసీ అమల్లో ఉంది. పరిశ్రమల కోసం దరఖాస్తు చేసుకుంటే టీ హబ్ ద్వారా 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నాము.
హైదరాబాద్‌లో శాఫ్రాన్ ఏర్పాటు చేసే ఎంఆర్ఓ ప్రపంచంలోనే పెద్దది. విమాన రంగంలో కేంద్రం నుంచి తెలంగాణకు అనేక అవార్డులు వచ్చాయి’ అని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్‌తో పాటు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
IT and Industries Minister @KTRTRS inaugurated the world class Aerospace factories @Safran Electrical & Power factory, @Safran Aircraft Engines in Hyderabad today. pic.twitter.com/8HmSJsAjQK
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 7, 2022
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..