బీ అలర్ట్.. ఏపీవైపు దూసుకొస్తున్న మోంథా తుఫాన్.. ఈ ప్రాంతాల్లో కుండపోత వానలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఏపీ వైపు మొంథా తుఫాన్ తరుముకొస్తోంది.. ప్రస్తుతం గంటకు 17 కి.మీ వేగంతో తుఫాన్ దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మోంథా తుఫాన్.. మరికాసేపట్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.. ఈ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

ఏపీ వైపు మొంథా తుఫాన్ తరుముకొస్తోంది.. ప్రస్తుతం గంటకు 17 కి.మీ వేగంతో తుఫాన్ దూసుకొస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మోంథా తుఫాన్.. మరికాసేపట్లో తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.. ఈ రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.. కోస్తా జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, నెల్లూరు, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.. 95 ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాల రికార్డు నమోదైంది.
ప్రస్తుతం పశ్చిమమధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించింది మొంథా తుఫాన్.. కాసేపట్లో తీవ్ర తుఫాన్ మారి.. ఏపీ తీరం వైపు దూసుకురానుంది. ఐఎండీ లేటెస్ట్ బులెటిన్ ప్రకారం : తీవ్ర తుపాను మచిలీపట్నంకు 190, కాకినాడ 270, విశాఖ పట్నం 340, గోపాల్ పూర్ 550 కి. మి. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.
చంద్రబాబు కీలక ఆదేశాలు..
తుఫాన్ జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు సమీక్ష జరుపుతున్నారు. మంత్రులు, అధికారులతో అర్ధరాత్రి వరకు సమీక్షలు కొనసాగాయి.. మొంథా తుఫాన్‌పై ఆందోళన అవసరం లేదన్న సీఎం.. అప్రమత్తంగా ఉందామని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం సన్నద్ధంగా ఉండాలని.. కింది స్థాయి సిబ్బందిని RTGS సెంటర్ నుంచి నేరుగా అలర్ట్ చేయాలని సూచించారు. 338 మండలాల్లో అధిక వర్షాలకు అవకాశం ఉందని.. ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అంటోంది ప్రభుత్వం .. ఇప్పటికే ఆర్టీసీ బస్సులు, రైళ్లు, విమానాల సంఖ్యను కుదించారు. సెలవులు రద్దు చేసి అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేశారు. కోస్తా జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




