AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: వైసీపీ గుండెల్లో మండలి మంటలు.. ఇక మిగిలేది ఎందరు..? ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ టాపిక్

ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ రాజీనామాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామా చేయగా... తాజాగా మరొకరు రిజైన్‌ చేయడం హీట్‌ పెంచుతోంది. అదే దారిలో మరికొందరు ఉన్నారనే ప్రచారం ప్రతిపక్ష వైసీపీని మరింత టెన్షన్‌ పెడుతోంది. ఇంతకీ.. రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్సీలు ఎవరు?.. త్వరలో రిజైన్‌ చేయబోయే వైసీపీ మండలి సభ్యులు ఎవరు?.. అనేది చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: వైసీపీ గుండెల్లో మండలి మంటలు.. ఇక మిగిలేది ఎందరు..? ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ టాపిక్
YCP Chief YS Jagan
S Haseena
| Edited By: |

Updated on: Nov 25, 2024 | 6:48 PM

Share

ఏపీ పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ రాజీనామాలు కాక రేపుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు ఎమ్మెల్సీల రాజీనామా చేయగా… తాజాగా మరొకరు రిజైన్‌ చేయడం హీట్‌ పెంచుతోంది. అదే దారిలో మరికొందరు ఉన్నారనే ప్రచారం ప్రతిపక్ష వైసీపీని మరింత టెన్షన్‌ పెడుతోంది. ఇంతకీ.. రాజీనామా చేసిన ఆ ఎమ్మెల్సీలు ఎవరు?.. త్వరలో రిజైన్‌ చేయబోయే వైసీపీ మండలి సభ్యులు ఎవరు?.. అనేది చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పీకల్లోతు కష్టాల్లో ఉన్న వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల పరాభవం నుంచి తేరుకుంటున్న వైసీపీకి ఎమ్మెల్సీల రాజీనామాలు మరింత టెన్షన్‌ పెడుతున్నాయి. ఇప్పటికే ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేయగా.. విజయనగరం జిల్లాకు చెందిన ఇందుకూరి రఘురాజు సభ్యత్వ వ్యవహారం మండలి ఛైర్మన్‌ దగ్గర పెండింగ్‌లో ఉంది. తాజాగా.. ఏలూరు జిల్లాకు చెందిన జయమంగళ వెంకటరమణ కూడా వైసీపీకి గుడ్‌ బై చెప్పేశారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీ సభ్యత్వానికి జయమంగళ రాజీనామా చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతున్న ఎమ్మెల్సీలు

వాస్తవానికి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి శాసనమండలిలో మాత్రమే గట్టి పట్టుంది. మండలిలో టీడీపీకి పది మంది ఎమ్మెల్సీలు ఉంటే.. వైసీపీకి 37 మంది ఉన్నారు. దాంతో… శాసనసభలో సంఖ్యా బలం లేకున్నా పెద్దల సభలో అయినా పట్టు నిలుపుకుందామన్న భావనలో ఉంది జగన్‌ పార్టీ. అయితే మారుతున్న రాజకీయాలతో కీలక నేతలు, ఎమ్మెల్సీలు.. ఒక్కొక్కరు వైసీపీని వీడుతుండడం ఆ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలక్షన్స్‌ ముందు నలుగురు.. తర్వాత నలుగురు ఎమ్మెల్సీలు వైసీపీ రాజీనామా చేశారు. డొక్కా మాణిక్యవరప్రసాద్‌, వంశీకృష్ణయాదవ్‌, సీ.రామచంద్రయ్య ఎన్నికలకు ముందే రాజీనామా చేయగా.. ఎన్నికల తర్వాత.. కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి, పోతుల సునీత, తాజాగా జయమంగళ వెంకటరమణ రిజైన్‌ చేశారు. దాంతో.. రాజీనామా చేసిన ఎమ్మెల్సీల సంఖ్య ఏడుకు చేరగా.. ఇందుకూరి రఘురాజు సభ్యత్వ పునరుద్ధరణ అంశం హైకోర్టు ఆదేశాలతో మండలి ఛైర్మన్‌ దగ్గర పెండింగ్‌లో ఉంది.

మరికొందరు ఎమ్మెల్సీలు వైసీపీకి గుడ్‌ బై చెప్తారా?

మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా త్వరలో రాజీనామా చేస్తారనే ప్రచారం మరింత హీట్‌ పెంచుతోంది. ప్రధానంగా.. పండుల రవీంద్రబాబు, తోట త్రిమూర్తులు, జఖియా ఖానం.. వైసీపీకి గుడ్‌ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు టాక్‌ నడుస్తోంది. అయితే.. రఘురాజుపై అనర్హత వేటుతో వీళ్లందరూ వెయిటింగ్‌ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అనర్హత వేటుకు గురైన ఇందుకూరి రఘురాజు.. ఎమ్మెల్సీ సభ్యత్వం హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం శాసనమండలి చైర్మన్‌ దగ్గరకు చేరింది. రేపోమాపో రఘురాజు ఎమ్మెల్సీ సభ్యత్వ పునరుద్ధరణపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రఘురాజు అనర్హత వేటుపై స్పష్టత వస్తే.. మరికొందరు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేస్తారనే టాక్‌ వైసీపీని మరింత కంగారు పెడుతోంది. ఇలా వచ్చే సెషన్ కు ఇంకెంత మంది మిగులాతారో అంటూ పేర్కొటున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసిపి కోలుకోలేక పోతుంది. 11 మంది ఎమ్మెల్యేలున్న వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీ ఎంఎల్ఏలు ఎవ్వరూ శాసనసభకు రావటం లేదు. అయితే శాసనసభలో రాని అవకాశాన్ని శాసనమండలి వేదికగా తమ గళాన్ని వినిపించాలని వైసీపీ భావిస్తుంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీలు రాజీనా చేస్తుండటంతో.. శాసనమండలిలో కూడా జగన్ కు చిక్కులు తప్పవన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..