తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. వివరాలివే..
ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు
ఏపీ, తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు గానూ ఎలక్షన్ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్ 16న విడుదల కానుండగా.. నవంబర్ 23 వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. అలాగే నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఇక డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించనుండగా.. 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
కాగా, ఏపీలోని అనంతపురం 1, కృష్ణా 2, తూర్పుగోదావరి 1, గుంటూరు 2, విజయనగరం 1, విశాఖపట్నం 2, చిత్తూరు 1, ప్రకాశం 1 చొప్పున ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్ , నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి, కరీంనగర్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. షెడ్యూల్ విడుదలైన దృష్ట్యా ఆయా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.
Also Read:
ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ దొరికేశాడుగా.. కోహ్లీని రీప్లేస్ చేసేది మాజీ సన్‌రైజర్స్ ప్లేయర్.!
Fruits Side Effects: ఈ 4 పండ్ల కాంబినేషన్ చాలా డేంజర్.! వీటిని కలిపి తినొద్దు.! అవేంటో తెలుసా..