AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సవాలుగా మారిన హారిక మిస్సింగ్ కేసు..కట్‌చేస్తే.. రైల్వే వైఫైతో కథ క్లైమాక్స్

చదువుకోవడం ఇష్టం లేని హారిక తల్లిదండ్రులు మాటలకు మనస్తాపం చెంది నవంబర్ 5, 2025 ఉదయం తల్లిదండ్రులకు కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన వెంకటనాయుడు అదే రోజు రాత్రి బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరసాడ గ్రామం నుంచి తప్పిపోయిందని గుర్తించి కేసును పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

సవాలుగా మారిన హారిక మిస్సింగ్ కేసు..కట్‌చేస్తే..  రైల్వే వైఫైతో కథ క్లైమాక్స్
Niharika Missing Case Ends
Gamidi Koteswara Rao
| Edited By: Jyothi Gadda|

Updated on: Nov 19, 2025 | 9:15 PM

Share

ఇంటి నుంచి అలిగి వెళ్లిపోయిన 18 ఏళ్ల విద్యార్థినిని తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేర్చడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఎట్టకేలకు టెక్నాలజీ సహాయంతో అనేక అవస్థలు పడి విద్యార్థిని క్షేమంగా ఇంటికి చేర్చారు పోలీసులు. వంగపండు హారిక అనే విద్యార్థి బొబ్బిలి పట్టణంలో తన కుటుంబంతో జీవనం సాగిస్తుంది. ఈమె తండ్రి వంగపండు వెంకటనాయుడు ఒక చిన్న వ్యాపారి, తల్లి ఇంటి పనులు చూసుకుంటుంది. హారిక కలవరాయిలోని ఓ కాలేజీలో చదువుతోంది. తక్కువ మార్కులు వస్తున్న హారికను బాగా చదువుకోవాలని తల్లిదండ్రులు మందలించారు. చదువుకోవడం ఇష్టం లేని హారిక తల్లిదండ్రులు మాటలకు మనస్తాపం చెంది నవంబర్ 5, 2025 ఉదయం తల్లిదండ్రులకు కాలేజీకి వెళ్తున్నాను అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. కానీ సాయంత్రం అయినా ఇంటికి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన వెంకటనాయుడు అదే రోజు రాత్రి బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరసాడ గ్రామం నుంచి తప్పిపోయిందని గుర్తించి కేసును పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

నవంబర్ 7న బలిజిపేట పోలీసులు క్రైమ్ నంబర్ 54/2025 కింద మహిళ మిస్సింగ్ కేసుగా రిజిస్టర్ చేశారు. వెంటనే అప్రమత్తమైన జిల్లా ఎస్పీ ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఒక బృందం అడిషనల్ ఎస్పీ. మరో బృందం పార్వతీపురం రూరల్ సీఐ నేతృత్వంలో పనిచేసింది. ఏర్పాటు చేసిన బృందాలు వివిధ నగరాలకు వెళ్లి హారికను వెతికాయి. మరొక బృందం టెక్నికల్ టీమ్‌గా ఎస్పీ ఆదేశాలతో పనిచేసింది. అలా పోలీసు బృందాలు హారిక కోసం నిరంతరం గాలింపు చర్యలు చేపట్టారు. మొదట సీసీటీవీ ఫుటేజ్ ద్వారా హారిక విజయనగరం రైల్వే స్టేషన్‌లో బెంగళూరు వెళ్లే రైలుకు టికెట్ తీసుకుని ఆ రైలు ఎక్కినట్లు గుర్తించారు.

వెంటనే ఒక ఎస్సై నేతృత్వంలో టీమ్‌ను బెంగళూరుకు పంపారు. మరొక టీమ్ రైలు ఆగిన ప్రతి స్టేషన్‌లో హారిక దిగిందా లేదా అని తనిఖీ చేసింది. మొబైల్ ద్వారా తనను గుర్తించే అవకాశం ఉందని హారిక ముందుగానే తన మొబైల్ సిమ్‌ను ఉపయోగించకుండా సిమ్ తీసేసింది. కేవలం రైల్వే వైఫై ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేస్తుండటంతో మొదట్లో ఆమె లొకేషన్ ట్రాక్ చేయడం కష్టమైంది. కానీ నవంబర్ 14న ఆమె మళ్లీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆన్‌లైన్ లోకి వచ్చింది. బెంగుళూరులో ఉన్న తన బాబాయికి ఇన్ స్టా లో చాట్ చేస్తూ తాను చనిపోతానని బెదిరించడం ప్రారంభించింది. ఆమె ఆన్ లైన్ లోకి రావడం గమనించిన టెక్నికల్ టీమ్ వెంటనే అదే అవకాశంగా భావించి పని ప్రారంభించి ఆమె ఉన్న లొకేషన్‌ను ట్రేస్ చేసింది. బెంగళూరులో ఉన్న ఎస్సై టీమ్ ను అప్రమత్తం చేసి కెఎస్ఆర్ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ పోలీసుల సహాయంతో హారికను పట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

హారిక ఇంటి నుండి అలిగి సుమారు పదిహేను రోజుల పాటు వివిధ రైల్వే స్టేషన్ వెయిటింగ్ హాల్స్ లో ఉంటూ, స్టేషన్ లోనే తింటూ, అక్కడే నిద్రపోతూ కాలం గడిపింది. వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, బెంగుళూరు చుట్టేసింది. పోలీసులు వెదుకుతారని దొరక్కుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంది. చివరికి మొబైల్ సిమ్ కూడా వాడకుండా టెక్నాలజీకి కూడా దొరకుండా జాగ్రత్త పడింది. ఎన్ని జాగ్రత్తలు పడ్డా ఎక్కడోచోట ఏదో ఒక ఆధారం వదులుతారని అనుకున్నట్లే రైల్వే వై ఫై వాడటంతో ఎట్టకేలకు అదే టెక్నాలజీ సహాయంతో హరికను పట్టుకొని సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.