Watch: పరిమితికి మించి ఎక్కన జనం.. డ్రైవర్ చేసిన పనికి నోరెళ్లబెట్టిన ప్రయాణికులు.. ఏం చేశాడో తెలిస్తే..
ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో బస్సు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. బస్సుల్లో పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకోవడం ద్వారా ప్రమాదం జరిగినప్పుడు ఎక్కవ ప్రాణనష్టం జరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్..బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో వారు కొందరు దిగిపోవాలని సూచించాడు. కానీ వారు వినకపోవడంతో.. వారందరికీ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. బస్సును నేరుగా పీఎస్‌కు తీసుకెళ్లాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది.

బస్సులో ప్రమాదం జరిగే అవకాశం ఉందని, కొంతమంది దిగిపోవాలని ఎంతో చెప్పిన వినకపోవడంతో ఆర్టీసీ బస్సును ప్రయాణికులతో సహా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు ఓ డ్రైవర్.. ఈ ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఎమ్మిగనూరు డిపో నుండి ఊరుకుందా కు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి సుమారు 120 కి పైగా ప్రయాణికులు ఎక్కారు. దీంతో డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులతో వాగ్వాదానికి దిగారు. పరిమితికి మించి బస్సులో ప్రయాణికులు ఉంటూ ప్రయాణం చేస్తే ఏదైనా సంఘటన సంభవించే అవకాశం ఉందని.. కొంతమంది ప్రయాణికులు దిగిపోవాలని సూచించారు. కానీ వారు ఎంత చెప్పినా వినలేదు.
దీంతో ఏమి చేయాలో అర్థం కాకా ఆర్టీసీ డ్రైవర్ నేరుగా ఆ బస్సును ప్రయాణికులతో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్ళాడు. అక్కడి పోలీస్‌ల జరిగిన విషయాన్ని తెలియజేశాడు. దీంతో పరిమితికి మంచి ఎక్కువగా ఉన్న ప్రయాణికులను పోలీసులు బస్సులోంచి దించేశారు. అయితే ఇలా ఆర్టీసీ బస్టాండ్ నుండి బస్సులు ఎక్కించుకొని ఇలా రోడ్డుపై తమను వదిలేస్తే ఎలా వెళ్లాలంటూ అధికారులను ప్రయాణికులు ప్రశ్నించారు. ప్రతి అమావాస్యకు ఉరుకుంద ఈరన్న స్వామి ఆలయానికి వెళ్లాలంటే బస్సు సర్వీసు లేక ఇలా ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఇప్పటికైనా డిపో అధికారులు స్పందించి బస్సు సర్వీస్ లను పెంచాలని వారు డిమాండ్ చేశారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
