నంధ్యాలలో వైఎస్సార్ విగ్రహం రచ్చపై మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు!
నంద్యాలలో వైఎస్సార్ (YSR) విగ్రహం ధ్వంసం అయిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆయన మండిపడ్డారు. ఇందుకోసం జగన్ తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపారని లోకేశ్ ఆరోపించారు.

నంద్యాలలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడు జమ్ములయ్య వైఎస్సార్‌సీపీ నేతల ముఖ్య అనుచరుడని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారని మంత్రి పేర్కొన్నారు. తమ పార్టీ నేతలే విగ్రహాలను ధ్వంసం చేయించి, ఆ నెపాన్ని ప్రభుత్వంపై నెట్టేందుకు క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
నాటకాల రాయుడు జగన్ అంటూ మంత్రి లోకేశ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంత్రి లోకేశ్ తన ట్వీట్‌లో వైఎస్ జగన్ గతంలో జరిగిన కొన్ని సంఘటనలను ప్రస్తావిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “జగన్ నాటకాలు చూసి చూసి జనాలు ఛీకొట్టినా.. ఆయన మాత్రం తన డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడు ఈ జగన్. ఎన్నిసార్లు తప్పు చేస్తూ దొరికిపోయినా మీ కుట్రలు, క్షుద్ర రాజకీయాలు మానరా?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి, వైషమ్యాలు రెచ్చగొట్టాలని చూసే ఇలాంటి కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, శాంతిభద్రతలను అదుపు తప్పించేందుకు ప్రయత్నిస్తే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రి లోకేశ్ హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో.. రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది.
#PsychoFekuJagan జగన్ నాటకాలు చూసి చూసి జనం ఛీ కొట్టినా.. ఆ డ్రామాలు మానడం లేదు. బాబాయి గుండెపోటు, కోడి కత్తి, గులకరాయి నాటకాల రాయుడు జగన్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు తన గొడ్డలి పార్టీ కార్యకర్తలను రంగంలోకి దింపాడు. నంద్యాలలో వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన… pic.twitter.com/1mgKiaiEik
— Lokesh Nara (@naralokesh) May 31, 2026
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..