AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా ఇండస్ట్రీలో అతనే నా ఫ్రెండ్.. వచ్చే జన్మలో అలా పుట్టాలని ఉంది : సయాజీ షిండే

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు సాయాజీ షిండే. ఎన్నో చిత్రాల్లో విలన్ పాత్రలు, సహయ నటుడిగా కనిపించి మెప్పించాడు. చాలాకాలంగా తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఈ వర్సటైల్ యాక్టర్.. తెలుగు సినిమాలతో పాటు మారాఠిలోనూ సినిమాలు చేసి మెప్పించారు.

సినిమా ఇండస్ట్రీలో అతనే నా ఫ్రెండ్.. వచ్చే జన్మలో అలా పుట్టాలని ఉంది : సయాజీ షిండే
Sayaji Shinde
Rajeev Rayala
|

Updated on: May 31, 2026 | 5:35 PM

Share

ప్రముఖ నటుడు సయాజీ షిండే ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించారు. ఒకప్పుడు ఆయన సినిమాలు వరుసగా విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. ఈ మధ్యకాలంలో ఆయన పెద్దగా కనిపించడం లేదు. తెలుగుతో పాటు మరాఠి సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సాయాజీ షిండే. కాగా గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన సినీ జీవితం, వ్యక్తిగత జీవితం, రాఖీ సినిమా అనుభవాలతో పాటు అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. హాస్యనటుడు అలీతో తనకున్న సన్నిహిత అనుబంధాన్ని వివరిస్తూ, ఇద్దరి పోరాటాలు, జీవిత అనుభవాలు, కష్టతరమైన రోజులు, ప్రస్తుతం పొందిన స్థానం గురించి తరచుగా మాట్లాడుకునేవారమని తెలిపారు. అలీతో తన కెమిస్ట్రీ ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చేదని షిండే పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : వామ్మో..! మెంటలెక్కిపోయే ట్విస్ట్‌లు.. ఒంటరిగా చూడాల్సిన సినిమా… స్ట్రీమింగ్ ఎక్కడంటే

సినీ పరిశ్రమలో పదేళ్లుగా తన పద్ధతుల్లో ఎటువంటి మార్పు రాలేదని సయాజీ షిండే తెలిపారు. ఆయన పనిపైనే పూర్తి ఏకాగ్రతతో ఉంటారని, పార్టీలు, గ్రూపులకు దూరంగా ఉంటారని చెప్పారు. వందకు పైగా చిత్రాలలో నటించినా, ప్రతి షూటింగ్‌లో ఒక విద్యార్థిలా డైరెక్టర్‌ను సన్నివేశం గురించి అడిగి, అసిస్టెంట్‌తో మాట్లాడి, పెన్, ప్యాడ్‌తో డైలాగులు రాసుకుని, వాటిపై పని చేస్తానని వెల్లడించారు. ఇది తన నిబద్ధతకు నిదర్శనమని, దీనివల్లే తాను ఎక్కువ సినిమాల్లో నటించగలిగానని తెలిపారు. సయాజీ షిండే తన కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ.. తన కుటుంబంలో ఎవరూ సినీ పరిశ్రమలో లేరని, తనది వ్యవసాయ కుటుంబమని తెలిపారు. నటుడిగా సయాజీ షిండే తమిళంలో 50, కన్నడలో 35-40, మరాఠీ, హిందీ, మలయాళంలోనూ సినిమాలు చేశారు.

ఇది కూడా చదవండి : బాలయ్య బిడ్డా మజాకా..! ఆ గ్రేస్ ముందు హీరోయిన్స్ తేలిపోతారుగా.. వీడియో వైరల్

రాఖీ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, సుహాసినిలతో కలిసి పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ, సెట్‌లో ప్రతి ఒక్కరూ తమ పాత్రలపైనే దృష్టి సారిస్తారని, అక్కడికి వచ్చిన తర్వాత ఎవరూ స్టార్ కాదని, అందరూ కుటుంబ సభ్యుల్లాగే ఉంటారని చెప్పారు. ఆ సినిమాలో తన విలన్ పాత్ర దర్శకుడి విజన్ మేరకు చాలా ప్రమాదకరంగా కనిపించాల్సి వచ్చిందని, అందుకు తగ్గట్టుగా ఆ సీన్లను పండించానని, కూర్చునే స్టైల్ వంటివి కూడా పాత్రకు బలాన్నిచ్చాయని ఆయన వివరించారు. సయాజీ షిండే ప్రకృతి పట్ల తన ప్రేమను, సామాజిక బాధ్యతను చాటుకున్నారు. మరో జన్మ అంటూ ఉంటే చెట్టుగా పుట్టాలని ఆకాంక్షించారు. తల్లి ఎంత ముఖ్యమో, పుట్టిన తర్వాత మనం జీవించే ఆక్సిజన్ అందించే చెట్లు కూడా అంతే ముఖ్యమని, వాటిని కాపాడడంలో మనం విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ప్రివ్యూ చూసి ఇదేం సినిమా.. అట్టర్ ఫ్లాప్ అన్నారు..! కట్ చేస్తే ఇండస్ట్రీలోనే క్లాసిక్ హిట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us