AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GT Highlights, IPL 2026 Final: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా బెంగళూరు

RCB vs GT IPL 2026 Final Live Score in Telugu: గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

RCB vs GT Highlights, IPL 2026 Final: వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా బెంగళూరు
Rcb Vs Gt Final
Venkata Chari
|

Updated on: May 31, 2026 | 11:39 PM

Share

RCB vs GT IPL 2026 Final Highlights in Telugu: గుజరాత్ టైటాన్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది.

దీనికి ప్రతిగా, విరాట్ కోహ్లీ అజేయంగా చేసిన 75 పరుగుల సహాయంతో బెంగళూరు 18 ఓవర్లలో 161 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

గుజరాత్ టైటాన్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, సాయి కిషోర్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేష్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI: విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, జాకబ్ డఫీ.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 31 May 2026 11:27 PM (IST)

    వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా ఆర్సీబీ

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం వరుసగా 2వసారి ఐపీఎల్ విజేతగా నిలిచింది. డిఫెండిండ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన బెంగళూరు టీం తన ట్రోఫీని నిలబెట్టుకుంది.

  • 31 May 2026 10:52 PM (IST)

    కోహ్లీ హాఫ్ సెంచరీ

    కోహ్లీ 25 బంతుల్లో హాప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇందులో 7 ఫోర్లు, 2సిక్స్‌లు ఉన్నాయి. కాగా, కోహ్లీ ఐపీఎల్ కెరీర్‌లో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం విశేషం

  • 31 May 2026 10:36 PM (IST)

    ఒకే ఓవర్లో రెండు వికెట్లు..

    రషీద్ ఖాన్ తన తొలి ఓవర్‌లో ఆర్సీబీ కెప్టెన్ పటిదార్, మరో బ్యాటర్ పాండ్యాలను ఔట్ చేసి షాకిచ్చాడు. దీంతో 9 ఓవర్లు ముగిసే సరికి ఆర్సీబీ 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.

  • 31 May 2026 10:28 PM (IST)

    8 ఓవర్లకు

    8 ఓవర్లు ముగసే సరికి ఆర్సీబీ టీం 2 వికెట్లు కోల్పోయి 88 పరుగులు చేసింది. ఆర్సీబీ విజయానికి మరో 68 పరుగులు చేస్తే సరిపోతుంది.

  • 31 May 2026 10:10 PM (IST)

    వెంకటేష్ అయ్యర్ ఔట్..

    4.3 ఓవర్లలో ఆర్సీబీ ఒక వికెట్ కోల్పోయి 62 పరుగులు సాధించింది. వెంకటేష్ అయ్యర్ 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 32 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించాడు.

  • 31 May 2026 09:56 PM (IST)

    2 ఓవర్లకు

    2 ఓవర్లు ముగిసే సరికి బెంగళూరు టీం 23 పరుగులు చేసింది. ఇందులో 22 పరుగులు వెంకటేష్ అయ్యర్ చేసినవే కావడం గమనార్హం. ఇందులో 3 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.

  • 31 May 2026 09:31 PM (IST)

    విరామంలో ఖైలాష్ ఖేర్ మ్యూజిక్ షో

    ఇన్నింగ్స్ విరామంలో ఖైలాష్ ఖేర్ పాటలతో ఉర్రూతలిగిస్తున్నాడు. మరికొద్దిసేట్లో ఆర్సీబీ చేజింగ్ మొదలుకానుంది.

  • 31 May 2026 09:20 PM (IST)

    బెంగళూరు టార్గెట్ 156

    జీటీ 8 వికెట్ల నష్టానికి 155 పరుగులతో ముగించింది. వరుసగా రెండు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన మూడో జట్టుగా నిలవాలంటే ఆర్‌సీబీకి 156 పరుగులు అవసరం.

  • 31 May 2026 09:00 PM (IST)

    17 ఓవర్లకు..

    17 ఓవర్లు ముగిసే సరికి గుజరాత్ టీం 6 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది.

  • 31 May 2026 08:44 PM (IST)

    5వ వికెట్ కోల్పోయిన గుజరాత్..

    గుజరాత్ టీం 14.1 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 99 పరుగులు చేసింది. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో గుజరాత్ టీం కష్టాల్లో కూరుకపోతోంది. కనీసం పోరాడే స్కోర్ చేసేలా కనిపించడం లేదు.

  • 31 May 2026 08:34 PM (IST)

    బట్లర్ కూడా పెవిలియన్‌కు..

    బట్లర్ 19 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో గుజరాత్ 12. 2 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ కష్టాలు మరింత పెరిగాయి.

  • 31 May 2026 08:25 PM (IST)

    10 ఓవర్లకు..

    10 ఓవర్లు ముగసే సరికి గుజరాత్ టీం 3 వికెట్లు కోల్పోయి 63 పరుగులు చేసింది. సుందర్ 4, బట్లర్ 14 పరుగులో నిలిచారు.

  • 31 May 2026 08:13 PM (IST)

    3వ వికెట్ కోల్పోయిన గుజరాత్..

    నిశాంత్ సింధు 20 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడుతోన్న క్రమంలో ఓ భారీ షాట్ కోసం వెళ్లి ఔటయ్యాడు. దీంతో గుజరాత్ 8.1 ఓవర్ లో 3 వికెట్లు కోల్పోయిన 55 పరుగులు చేసింది.

  • 31 May 2026 08:05 PM (IST)

    RCB vs GT IPL 2026 Final LIVE: ముగిసిన పవర్ ప్లే..

    పవర్‌ప్లే ముగిసింది. ఈ ఫైనల్‌లోని తొలి ఆరు ఓవర్ల తర్వాత ఆర్‌సిబి పైచేయి సాధించింది. జిటి ఓపెనర్లు ఇద్దరినీ పెవిలియన్‌కు పంపగలిగారు. ఆతిథ్య జట్టు కేవలం 45 పరుగులు మాత్రమే చేసింది. పోటీలోకి తిరిగి రావడానికి గుజరాత్ జట్టుకు ఒక భాగస్వామ్యం అవసరం. 

  • 31 May 2026 07:54 PM (IST)

    RCB vs GT LIVE: సాయి సుదర్శన్ ఔట్..

    138.6 కి.మీ/గం వేగంతో వచ్చిన షార్ట్ బాల్‌ను సాయి సుదర్శన్ ఎదుర్కొనలేకపోయాడు. దీంతో బంతి  బంతి నేరుగా గాల్లోకి లేవగా జితేష్ శర్మ చాలా దూరం వెళ్లి క్యాచ్ పట్టుకున్నాడు. దీంతో భువి వికెట్ల ఖాతాలో27వ వికెట్ చేరింది.

  • 31 May 2026 07:48 PM (IST)

    RCB vs GT LIVE: గిల్ ఔట్..

    బంతి హార్డ్ లెంగ్త్‌లో, ఆఫ్ స్టంప్‌కు బయటగా వచ్చింది. గిల్ దాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించి, తన ట్రేడ్‌మార్క్ అయిన షార్ట్-ఆర్మ్ తో కొట్టబోయాడు. బంతి బౌన్స్‌ను సరిగ్గా అంచనా వేయలేక, బ్యాట్ అంచుకు తగిలి బంతి గాల్లోకి చాలా ఎత్తుకు వెళ్లింది. మిడ్ ఆఫ్‌లో ఉన్న పాటిదార్, తన కుడి వైపునకు కదిలి, పరుగెత్తుకుంటూ వచ్చి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో పెవిలియన్‌కు తిరిగి వెళ్తున్న గిల్ తనపై తానే తీవ్ర ఆగ్రహంతో ఉన్నాడు. ఆటలో ఇది ఒక కీలకమైన ఘట్టం.

  • 31 May 2026 07:39 PM (IST)

    RCB vs GT IPL 2026 Final LIVE: తొలి ఓవర్‌లోనే డ్రామా

    తొలి ఓవర్ ముగిసే సరికి గుజరాత్ టీం 13 పరుగులు చేసింది. అయితే, సాయి సుదర్శన్ 2 వరుస బౌండరీల తర్వాత క్యాచ్ ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించాడు. కానీ, బ్యాటింగ్ టీం రివ్యూతో అది నాటౌట్‌గా తేలింది.

  • 31 May 2026 07:23 PM (IST)

    ఐపీఎల్ ప్లేఆఫ్స్/నాకౌట్స్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడినవారు:

    28 – ఎంఎస్ ధోని

    25 – రవీంద్ర జడేజా

    24 – రవిచంద్రన్ అశ్విన్, సురేష్ రైనా

    23 – రోహిత్ శర్మ, అంబటి రాయుడు

    19 – డ్వేన్ బ్రావో, విరాట్ కోహ్లీ*

  • 31 May 2026 07:23 PM (IST)

    RCB vs GT: ఒక ఐపీఎల్ సీజన్‌లో ఒక జట్టు ఉపయోగించిన అత్యంత తక్కువ మంది ఆటగాళ్లు :

    14 — సీఎస్‌కే (2015)

    15 — ఎంఐ (2018, 2020)

    16 — కేకేఆర్ (2018), సీఎస్‌కే (2021) & ఆర్‌సీబీ (2026)*

  • 31 May 2026 07:15 PM (IST)

    RCB vs GT LIVE Updates, IPL Final LIVE Updates: ఐపీఎల్ ఫైనల్స్‌లో టాస్ ప్రభావం:

    -టాస్ గెలిచిన జట్లు 10 సార్లు ట్రోఫీని గెలుచుకున్నాయి.

    -టాస్ ఓడిపోయిన జట్లు కూడా 8 సార్లు ఛాంపియన్‌లుగా నిలిచాయి.

  • 31 May 2026 07:13 PM (IST)

    RCB vs GT IPL 2026 Final LIVE: ఇంపాక్ట్ ప్లేయర్లు:

    గుజరాత్ టైటాన్స్: ప్రసిద్ధ్ కృష్ణ, గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, కుమార్ కుషాగ్రా, సాయి కిషోర్.

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: వెంకటేష్ అయ్యర్, కనిష్క్ చౌహాన్, స్వప్నిల్ సింగ్, అభినందన్ సింగ్, జోర్డాన్ కాక్స్.

  • 31 May 2026 07:11 PM (IST)

    IPL 2026 Final LIVE: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయింగ్ XI:

    విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ (కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్, జాకబ్ డఫీ.

  • 31 May 2026 07:09 PM (IST)

    IPL 2026 Final LIVE: గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ ఎలెవన్ :

    శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), బి సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, నిశాంత్ సింధు, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, కగిసో రబాడ, అర్షద్ ఖాన్, మహ్మద్ సిరాజ్

  • 31 May 2026 07:02 PM (IST)

    RCB vs GT Toss Update: టాస్ గెలిచిన ఆర్సీబీ..

    టాస్ గెలిచిన ఆర్సీబీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. కాగా, గిల్ మాట్లాడుతూ, మేం టాస్ గెలిస్తే బ్యాటింగ్ చేస్తామంటూ చెప్పుకొచ్చాడు.

  • 31 May 2026 06:56 PM (IST)

    బెంగళూరు కీలక ఆటగాళ్లు

    విరాట్ కోహ్లీ: గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 43 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతను 600 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఆడిన 15 మ్యాచ్‌లలో అతను ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు సాధించాడు.

    రజత్ పాటిదార్: క్వాలిఫయర్ 1లో గుజరాత్‌పై అజేయంగా 93 పరుగులు చేసి, తన జట్టు 250 పరుగుల మార్కును దాటడంలో సహాయపడ్డాడు. ఈ సీజన్‌లో, అతను 14 మ్యాచ్‌లలో 196.76 స్ట్రైక్ రేట్‌తో 486 పరుగులు సాధించాడు.

    భువనేశ్వర్ కుమార్: పర్పుల్ క్యాప్ రేసులో రెండవ స్థానంలో ఉన్నాడు. అతను 15 మ్యాచ్‌లలో 26 వికెట్లు పడగొట్టాడు. గుజరాత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అతను రెండు వికెట్లు తీసుకున్నాడు.

  • 31 May 2026 06:49 PM (IST)

     ఈ గుజరాత్ ఆటగాళ్లే కీలకం..

    శుభ్‌మన్ గిల్: క్వాలిఫయర్ 2లో రాజస్థాన్‌పై 104 పరుగుల సెంచరీ సాధించాడు. ఈ సీజన్‌లో అతను 6 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతను 15 మ్యాచ్‌లలో 722 పరుగులు చేశాడు.

    సాయి సుదర్శన్: రాజస్థాన్‌పై 58 పరుగులు చేసి, గిల్‌తో కలిసి 77 బంతుల్లో 167 పరుగుల శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అతను 16 మ్యాచ్‌లలో 710 పరుగులు చేశాడు.

    కాగిసో రబాడా: ప్రస్తుత సీజన్‌లో 28 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. అతను రాజస్థాన్ రాయల్స్‌పై వైభవ్ సూర్యవంశి (96 పరుగులు) వికెట్‌తో సహా రెండు వికెట్లు పడగొట్టాడు.

  • 31 May 2026 06:48 PM (IST)

    RCB vs GT Live Updates: మరికొద్దిసేపట్లో టాస్

    కీలక మ్యాచ్ కోసం రంగం సిద్ధమైంది. మరికొద్దిసేపట్లో టాస్ జరగనుంది. ఈమేరకు ఇరుజట్లు స్టేడియానికి చేరుకుని, తుది సన్నాహాలను పూర్తి చేస్తున్నాయి.

  • 31 May 2026 06:17 PM (IST)

    200+ స్కోరు చేస్తే విజయమే..

    గత 18 ఏళ్లలో, ఏ ఐపీఎల్ ఫైనల్‌లోనూ 200+ స్కోరును ఛేజ్ చేయలేదు. అంటే 200+ స్కోరు విజయానికి ఖాయం. 2008 నుంచి 2025 వరకు, ఫైనల్స్‌లో నాలుగు సార్లు 200+ స్కోర్లు నమోదయ్యాయి, కానీ వాటిని ఎప్పుడూ ఛేజ్ చేయలేదు.

  • 31 May 2026 06:07 PM (IST)

    గత రికార్డ్..

    ఈ రెండు జట్ల మధ్య తొమ్మిది ఐపీఎల్ మ్యాచ్‌లు జరగ్గా, వాటిలో బెంగళూరు ఐదింటిలో, గుజరాత్ నాలుగింటిలో విజయం సాధించాయి.

  • 31 May 2026 05:56 PM (IST)

    తొలి క్వాలిఫయర్ గెలిచిన జట్టుదే ట్రోఫీ?

    గత 8 ఫైనల్స్‌లోనూ క్వాలిఫయర్ 1 గెలిచిన జట్టే విజయం సాధించింది. 2016 నుంచి, అన్ని ఫైనల్స్ కూడా క్వాలిఫయర్ 1లో ఆడిన జట్ల మధ్యే జరిగాయి. 2016లో, హైదరాబాద్ ఎలిమినేటర్‌లో గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది.

  • 31 May 2026 05:56 PM (IST)

    రెండో ట్రోఫీ టార్గెట్..

    నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తమ రెండవ టైటిల్‌ను లక్ష్యంగా పెట్టుకున్నాయి. బెంగళూరు గతేడాది తమ తొలి టైటిల్‌ను గెలుచుకోగా, గుజరాత్ 2022లో తమ తొలి సీజన్‌లోనే ఛాంపియన్‌గా నిలిచింది.

  • 31 May 2026 05:44 PM (IST)

    ఫైనల్ పోరుకు రెడీ

    ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ నేడు అహ్మదాబాద్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

Published On - May 31,2026 5:36 PM

Follow Us