Andhra Pradesh: సర్కార్ కీలక నిర్ణయం.. రేపు ఉదయం 9 గంటల నుంచి రేషన్ సరుకుల పంపిణీ..!
ఏలూరు జిల్లాలో తుపాన్ ముందస్తు చర్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ , జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు..

అమరావతి, అక్టోబర్ 28: ఏలూరు జిల్లాలో తుపాన్ ముందస్తు చర్యలను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ , జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. తుఫాన్ హెచ్చరికలు నేపథ్యంలో ప్రజలకు క్షేత్రస్థాయి లో సేవలందించేందుకు పౌర సరఫరా శాఖ సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాలలో తుఫాను ప్రభావం అత్యధికంగా ఉంటుందని, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, వెస్ట్ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లా, తిరుపతి… ఈ 12 జిల్లాల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి రేషన్ షాప్ లో నిత్యవసర సరుకులు అందజేయనున్నట్లు తెలిపారు.
145 రేషన్ షాపుల ద్వారా 7 లక్షలమందికి సరుకుల పంపిణీ
తుఫాన్ ప్రబావిత ప్రాంతాలలో పౌరసరఫరాలశాఖ అందించే సేవలకు సిద్దంగా ఉన్నామని మంత్రి నాదేండ్ల మనోహర్ అన్నారు. 12జిల్లాలలోని 145 రేషన్ షాపులు అందుబాటులో ఉంటాయి. 7 లక్షలమంది లబ్ది దారులకు ఉపయోగ పడేలా నిత్యవసరాలు అందుబాటులో ఉంచాము. విద్యుత్ సరఫరా లేని ప్రాంతాలలో జనరేటర్స్ అందుబాటులోకి తీసుకొచ్చాం. జనరేటర్స్ కు అవసరమైన డిజిల్, కిరోసిన్ కూడా అందుబాటులో ఉంచాం. 12 జిల్లాల్లో 626 పెట్రోల్, డీజిల్ ఆయిల్ కంపెనీ అవుట్లెట్లు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా ఉండేందుకు కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి పెట్రోల్ డీజిల్ 3543 కిలో లీటర్ల అందుబాటులో ఉంచడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 30,000 టార్పాలిన్ రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందని ఆయన అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.
