AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Montha: ఆ కన్ను వద్ద ప్రశాంతం… దానికి చుట్టూ వందల కిలోమీటర్లు పరిధిలో విధ్వంసం..

తుఫాన్‌కీ కూడా ఒక హృదయ స్థానం ఉంటుంది. అదే కన్ను—Eye of the Cyclone. బయట అలజడి, లోపల నిశ్శబ్దం. వందల కిలోమీటర్ల దూరంలో విధ్వంసం సృష్టించే ఈ కేంద్రస్థానం… తుఫాన్‌ తీవ్రతను నిర్ణయించే అసలు బిందువు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Cyclone Montha: ఆ కన్ను వద్ద ప్రశాంతం... దానికి చుట్టూ వందల కిలోమీటర్లు పరిధిలో విధ్వంసం..
Cyclone Montha Eye
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2025 | 5:22 PM

Share

తుఫానైనా, భూకంపమైనా దానికో స్టార్టింగ్‌ పాయింట్‌ ఉంటుంది. అదోచోట కేంద్రీకృతం అవుతుంది. ఏపీలో తీర ప్రాంతాల్ని కుదిపేస్తున్న మొంథా తుఫాన్‌ కూడా బంగాళాఖాతంలో మరో కన్ను తెరుస్తోంది. తుఫాన్‌ కేంద్రం ఉండే ప్రాంతాన్ని EYE అంటారు. ఎందుకంటే అది చూట్టానికి కన్నులాగే ఉంటుంది. అక్కడ మాత్రం ప్రశాంతంగా ఉండి.. వందల కిలోమీటర్ల దూరంలో అంతులేనంత అలజడి సృష్టిస్తుంది. తుఫాన్‌ తీవ్రతని బట్టి ఇది విస్తరిస్తుంటుంది. తుఫాన్‌ ఆ కన్నుదాటిందంటే విలయమే.

తుఫాన్‌ ముందు అక్కడ ప్రశాంతంగా ఉంటుంది. తుఫాన్‌ గమనంలో కేంద్రస్థానమే కీలకం.  తీవ్రమైన తుఫాన్‌కి సెంటర్‌ పాయింట్‌ అది. సైక్లోన్‌ బలపడ్డాక స్పష్టంగా ఈ కన్ను కనిపిస్తుంది.  తీవ్ర తుఫాను అయితే ఆ కన్ను మరింత విశాలమవుతుంది. 10-20 కి.మీ వరకు కేంద్ర స్థానం విస్తరించి ఉంటుంది.  కేంద్ర స్థానం నుంచి 225 కి.మీ.దాకా తుఫాన్‌ తీవ్ర ప్రభావం ఉంటుంది. కొన్నిసార్లు కేంద్ర స్థానానికి వందల కి..మీ. దూరంలో కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది.  1979 మేలో 425 కి.మీ. పరిధిలో తుఫాన్ అల్లకల్లోలం చేసింది.  విశాఖను వణికించిన హుద్‌హుద్‌ కేంద్రస్థానం విస్తృతి 44-66 కి.మీ మాత్రమే.

తుఫాన్‌ కన్నులాంటి ఆ కేంద్రస్థానం దాటితే కొన్ని వందల కిలోమీటర్ల దాకా దాని తీవ్రత కనిపిస్తుంది. తుఫాన్లలో కొన్ని బలహీనపడ్డా, కొన్ని అల్లకల్లోలం సృష్టించినా.. దాని కదలికలకు కీలకం కేంద్ర స్థానమే. తుఫాను తీవ్రతకు అనుగుణంగా దీని విస్తృతి పెరుగుతుంది. 46 ఏళ్ల క్రితం ఏపీని కుదిపేసిన తుఫాన్‌ ఈ కేంద్రస్థానంనుంచి 425 కిలోమీటర్ల దాకా ప్రభావం చూపింది. అదే హుద్‌హుద్‌ ఎఫెక్ట్‌.. ఐ-పాయింట్‌ నుంచి 66కిలోమీటర్ల దాకా కనిపించింది. మరి మొంథా ప్రభావం ఎలా ఉండబోతోందో.. ఈ కేంద్రస్థానమే నిర్దేశించబోతోంది.

భారీ, అతి భారీ, అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, మేఘాలు అన్నీ ఈ కన్ను చుట్టూ ప్రభావం చూపిస్తాయి. తుఫాన్‌గా బలపడిన తర్వాత ఈ కేంద్ర స్థానం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. తుఫాన్‌ తీవ్రమయ్యాక ఇది మరింత పెద్దగా కనిపిస్తుంది. తుఫాన్‌ తీరానికి చేరువయ్యే కొద్దీ భారీ వర్షాలు, గాలులు వీస్తాయి. తీరం తాకినప్పుడు ప్రభావం ఉండదు. తర్వాత కాసేపటికి దాని తీవ్రత మొదలవుతుంది. అందుకే మొంథా తుఫాన్‌ అందరినీ అంతలా భయపెడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..