AP Weather: ప్రజలకు అలర్ట్.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రారం రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 42 మండలాల్లో వడగాల్పులు, శనివారం 44 మండలాల్లో వడగాల్పులు...
ఇంకా మార్చి నెల పూర్తికానేలేదు ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడి భగభగలు మండుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇంక ఏప్రిల్ చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రారం రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 42 మండలాల్లో వడగాల్పులు, శనివారం 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 42 మండలాల్లో.. వైయస్సార్ కడప 18, నంద్యాల 8, పార్వతీపురంమన్యం 8, ఎన్టీఆర్ 6, గుంటూరు 1, పల్నాడు ఒక్క మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం ప్రయాణాలు చేసే వారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..