Vizag: ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా!

Vizag: ట్రైన్ ఏసీ భోగీలో ఏదో వింత వాసన.. డౌట్ వచ్చి.. ఓ ప్రయాణీకుడి బ్యాగ్ చెక్ చేయగా!

Ravi Kiran

|

Updated on: Mar 30, 2024 | 8:09 PM

ట్రైన్ నెంబర్ 12806.. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్.. ఒకటవ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి రానుంది. విశాఖ రైల్వే స్టేషన్‌లో వస్తోన్న ఈ అనౌన్స్‌మెంట్ విని.. ఆ రైలు కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు అంతా దాన్ని ఎక్కేందుకు సన్నద్దమవుతున్నారు. ఇంతకీ ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..

ట్రైన్ నెంబర్ 12806.. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్.. ఒకటవ నెంబర్ ఫ్లాట్‌ఫామ్‌పైకి రానుంది. విశాఖ రైల్వే స్టేషన్‌లో వస్తోన్న ఈ అనౌన్స్‌మెంట్ విని.. ఆ రైలు కోసం వెయిట్ చేస్తున్న ప్రయాణీకులు అంతా దాన్ని ఎక్కేందుకు సన్నద్దమవుతున్నారు. ఇంతలో రైలు ఫ్లాట్‌ఫామ్‌పైకి రానే వచ్చింది. ఒక్కొక్కరిగా పాసింజర్లు అందరూ ట్రైన్ దిగుతున్నారు. ఈలోగా ఎక్కడనుంచి వచ్చారో గానీ.. ఖాకీ డ్రస్సుల్లో.. పోలీసులు ఒక్క ఉదుటున ఏసీ భోగి వైపు దూసుకొచ్చారు. లోపలున్న ప్రయాణీకులు కొంచెం కంగారుపడ్డారు. కట్ చేస్తే.. ఈ ఆర్‌పీఎఫ్ సిబ్బంది అంతా ఓ సీట్ దగ్గరకు వచ్చి ఆగారు. ఓ వ్యక్తి అక్కడ నిల్చుని బ్యాగులు సర్దుకుంటున్నాడు. అయితే అఫీషియల్స్ మాత్రం అతడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నింటికీ పొంతనలేని సమాధానాలే. ప్రతీ విషయానికి తడబడ్డాడు. ఖాకీలకు అనుమానం మరింత బలపడటంతో అతడి లగేజ్ చెక్ చేయగా.. ఇంకేముంది..! గంజాయి గుప్పుమంది.. ఢిల్లీ నుంచి విశాఖకు ఓ స్మగ్లర్ అక్రమంగా తీసుకొచ్చిన 16 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కాగా, అతడిపై కేసు నమోదు చేసి.. పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Published on: Mar 28, 2024 06:24 PM