Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు

Balu Jajala

|

Updated on: Mar 28, 2024 | 6:04 PM

తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌రావు తోపాటు రాధాకిషన్‌ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తెలంగాణలో ప్రకంపనలు పుట్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్ వ్యవహారంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్ట్‌గా బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్‌లో ప్రణీత్‌రావు తోపాటు రాధాకిషన్‌ రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు కనిపించకుండాపోయిన ఆయన.. కొద్దిసేపటి క్రితం బంజారాహిల్స్‌ పీఎస్‌కి వెళ్లారు.

రాధా కిషన్‌రావును వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్ కుమార్‌ ప్రశ్నిస్తున్నారు. ప్రణీత్‌రావుతో సంబంధాలు? ఎంతకాలంగా ఫోన్ ట్యాపింగ్‌ చేశారు? ఏయే ప్రాంతాల్లో ట్యాపింగ్‌కి పాల్పడ్డారు? ట్యాపింగ్ సమాచారాన్ని ఎవరికి పంపించారనే కోణంలో విచారిస్తున్నారు. అదే సమయంలో మరోవైపు సీఐ గట్టుమల్లును కూడా పోలీసులు విచారిస్తున్నారు. వీళ్లిద్దరి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే వివరాల ఆధారంగా మరికొంతమందికి నోటీసులిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published on: Mar 28, 2024 06:04 PM