AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈఎంఐ నగదు స్వాహా.. ఖాతాదారులకు కంగుతినిపించిన బ్యాంకు మేనేజర్..

విజయనగరం జిల్లాలో మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు ఓ ప్రవేట్ బ్యాంక్ మేనేజర్. జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లా జంక్షన్‎లో రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‎కు చెందిన కార్యాలయం ఉంది. ఆ బ్యాంక్ ఖాతాదారులకు హోమ్ లోన్స్ ఇస్తుంటుంది. ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులు, చిరు, మధ్య తరగతి వ్యాపారులు ఎక్కువగా ఈ బ్యాంక్‎లో హోమ్ లోన్స్ పొందుతుంటారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలు పొందడానికి అర్హత లేని కస్టమర్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బ్యాంకులో హోమ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు.

ఈఎంఐ నగదు స్వాహా.. ఖాతాదారులకు కంగుతినిపించిన బ్యాంకు మేనేజర్..
Finance Company
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Jul 24, 2024 | 9:00 PM

Share

విజయనగరం జిల్లాలో మోసాలకు పాల్పడి కటకటాల పాలయ్యాడు ఓ ప్రవేట్ బ్యాంక్ మేనేజర్. జిల్లా కేంద్రంలోని ఎస్పీ బంగ్లా జంక్షన్‎లో రెప్కో హోమ్ ఫైనాన్స్ లిమిటెడ్‎కు చెందిన కార్యాలయం ఉంది. ఆ బ్యాంక్ ఖాతాదారులకు హోమ్ లోన్స్ ఇస్తుంటుంది. ప్రభుత్వ, ప్రవేట్ ఉద్యోగులు, చిరు, మధ్య తరగతి వ్యాపారులు ఎక్కువగా ఈ బ్యాంక్‎లో హోమ్ లోన్స్ పొందుతుంటారు. జాతీయ బ్యాంకుల్లో రుణాలు పొందడానికి అర్హత లేని కస్టమర్స్ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ బ్యాంకులో హోమ్ లోన్స్ తీసుకుంటూ ఉంటారు. జాతీయ బ్యాంకుల కన్నా ఈ ప్రవేట్ బ్యాంక్‎లో వడ్డీ అదనంగా ఉన్నా ఇక్కడ త్వరగా హోమ్ లోన్స్ మంజూరు అవుతాయి. కాబట్టే ఇల్లు కొనాలనుకునే వారు ఇక్కడ రుణాలు పొందుతుంటారు. ఈ బ్యాంక్‎కి ఇంచార్జ్ మేనేజర్ గా ప్రవీణ్ కుమార్ అనే ఉద్యోగి ఉన్నాడు. రుణాలు మంజూరు చేయడానికి కానీ, అలాగే రుణాలు పొందిన కస్టమర్ల వద్ద నుండి తిరిగి ప్రతినెల ఈఎంఐ లు కట్టించడానికి కానీ మేనేజర్ ప్రవీణ్ క్రియాశీలంగా వ్యవహరిస్తుంటాడు.

ఈ క్రమంలోనే పలువురు కస్టమర్లు నేరుగా బ్యాంక్‎కు వచ్చి మేనేజర్‎కు తమ నెలవారీ ఈఎంఐలు కడుతుంటారు. మరికొందరు కస్టమర్స్ ఇళ్లకి వెళ్లి రికవరీ ఏజెంట్స్ రికవరీ చేసి ఆ డబ్బు కూడా మేనేజర్‎కి అందజేస్తారు. అలా ఖాతాదారుల నుండి రికవరీ చేసిన సొమ్మును వెంటనే మేనేజర్ ప్రవీణ్ కుమార్ బ్యాంక్ ఖాతాకు జమ చేయాలి. కానీ ప్రవీణ్ మాత్రం అలా చేయకుండా రికవరీ అయిన సొమ్మును తమ సొంతానికి ఖర్చు పెట్టుకున్నాడు. అలా మొత్తం సుమారు రూ.34 లక్షలు కాజేశాడు. అయితే కస్టమర్స్ నెలవారీ ఈఎంఐ బ్యాంక్ మేనేజర్‎కి కట్టినప్పటికి బ్యాంక్ ప్రధాన కార్యాలయం కాల్ సెంటర్ నుండి కస్టమర్స్‎కి నిరంతరం ఈఎంఐ కట్టాలని ఫోన్ కాల్స్ వస్తుండేవి. దీంతో కస్టమర్స్ బ్యాంక్ మేనేజర్‎ను కలిస్తే టెక్నికల్ ప్రాబ్లం వల్ల అలా కాల్స్ వస్తున్నాయి మీరు పట్టించుకోకండి అని మాయమాటలు చెప్పి నమ్మించేవాడు.

అయితే బ్యాంక్ కాల్ సెంటర్ నుండి వచ్చే ఫోన్ కాల్స్‎కి కస్టమర్స్ మాత్రం తాము ఈఎంఐ కట్టామని చెప్పడంతో కొద్దిరోజులకు బ్యాంక్ ఉన్నతాధికారులకు అనుమానం వచ్చింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ప్రవీణ్ కుమార్‎ని అడిగితే కస్టమర్స్ మన కార్యాలయానికి కట్టలేదని చెప్పేవాడు. అయితే ప్రవీణ్ కుమార్ మాటలపై అనుమానం వచ్చిన బ్యాంక్ నిర్వాహకులు లోతైన దర్యాప్తు జరుపగా ఈఎంఐల కోసం కస్టమర్స్ ఇచ్చిన డబ్బు ప్రవీణ్ కుమార్ కాజేశాడని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. వెంటనే పోలీసులకు పిర్యాదు చేశారు బ్యాంక్ రీజనల్ మేనేజర్. దీంతో పోలీసులు తమదైన విచారణ జరపగా తాను తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు అసలు వాస్తవాలు వెల్లడించాడు ప్రవీణ్ కుమార్. దీంతో బ్యాంక్ మేనేజర్ గా ఉండి మోసాలకు పాల్పడ్డ ప్రవీణ్ కుమార్‎ను పోలీసులు న్యాయప్రక్రియ ప్రకారం కటకటాలకు పంపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటె... క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటె... క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
11 సినిమాలు చేస్తే అన్ని అట్టర్ ప్లాప్.. ఫాలోయింగ్ చూస్తే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
కొబ్బరి, బెల్లం కలిపి తిన్నారంటే..
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
30 రోజులు మాంసం తినకపోతే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
వీళ్లు మనుషులా లేక రన్ మిషన్లా? టీ20 చరిత్రలో టాప్ రికార్డులు ఇవే
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై ఆర్బీఐ రూ.61.95 లక్షల జరిమానా.. కారణం?
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
భార్యాభర్తలు ఉదయం నిద్రలేవగానే ఈ పనులు చేస్తే.. లైఫ్ అంతా హ్యాపీ
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఓటీటీలోకి ఆంధ్ర కింగ్ తాలూకా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు
ఇవి తింటే మీ కిడ్నీలు సేఫ్.. లైట్ తీసుకున్నారో అంతే సంగతులు