Andhra: తెలుగు రాష్ట్రాల్లో ఆ ఫేమస్ స్వీట్ అంటే నెల్లూరు గుర్తుకు రావాల్సిందే.. అదేంటంటే.?
హైదరాబాద్ బిర్యానీ ఫేమస్.. నెల్లూరులో బిర్యానీతో పాటు చేపల పులుసు ఫేమస్ అయితే నెల్లూరు బిర్యానీ.. చేపల పులుసు. అయితే వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ అయినా ఖచ్చితంగా ఇష్టపడే ఫుడ్ ఐటెం ఒకటి ఉంది. అదే ఓ స్వీట్ ఐటెమ్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుపతి వెళితే లడ్డూ ప్రసాదం తెస్తారని మనకు తెలిసిన వారు కచ్చితంగా ఎదురు చూస్తుంటారు… అలాగే కాకినాడ వెళితే.. ఖాజా… ఆత్రేయపురం పూతరేకులు. ఇలా ఒక్కో చోట ఒకోటి ఫేమస్ ఫుడ్ ఐటెమ్ చూస్తూనే ఉంటాం. నెల్లూరు నుంచి వస్తున్నారని తెలిసి చాలామంది అడిగే ఫుడ్ ఐటెం ఇదే. నాన్‌వెజ్‌లో చేపల పులుసు, బిర్యాని తర్వాత ఆరెంజ్‌లో నెల్లూరు స్వీట్‌కి కూడా ఫేమస్ చాలా మందికి తెలుసు. అవును నెల్లూరులో దొరికే మలై కాజా స్వీట్ రాష్ట్రంలో మరెక్కడ దొరకదని మీలో ఎంతమందికి తెలుసు. అయినా నెల్లూరులో దొరికే మలై కాజాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇంతకీ నెల్లూరులో ఆ మలై కాజా ఎక్కడ దొరుకుతుంది నెల్లూరులో మాత్రమే ఎందుకంత ఫేమస్.
సాధారణంగా నెల్లూరు అంటే అందరికీ గుర్తు వచ్చేది ముందు ఫేమస్ బిర్యానీ అలాగే నెల్లూరు చేపల పులుసు నెల్లూరు బిర్యానికి చేపల పులుసుకు రెండు తెలుగు రాష్ట్రాల తో పాటు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే నెల్లూరు అనగానే గుర్తొచ్చే బిర్యానీ చేపల పులుసు కంటే అత్యంత తీపికరమైన స్వీటు మలై కాజా. నెల్లూరు అనగానే చాలామందికి మలై కాజా అంటే వినలేని ప్రీతి అందులోనూ నెల్లూరు నగరంలో జైహింద్ స్వీట్ షాప్‌లో దొరికే మలై కాజాకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో మంచి గుర్తింపు ఉంది. నెల్లూరులో తయారు చేసే మలై కాజా విదేశాలకు ఎగుమతి అవుతుందంటే నమ్మక తప్పదు. ఎందుకంటే ఇక్కడ మలై కాజా అంత ఫేమస్ మరీ జైహింద్ స్వీట్స్‌కు ప్రత్యేక గుర్తింపు పొంది.. దాదాపు 40 నుంచి 50 ఏళ్ల క్రితం ఇక్కడ జైహింద్ స్వీట్స్ ఏర్పాటు చేశారు. నగరంలోని ట్రంకు రోడ్లో చిన్న స్టాల్లో ఏర్పాటు చేసిన ఓ స్వీట్ దుకాణం నేడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ దొరికే మలై కాజా అంత ఫేమస్ మరి.




