AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు

బాలికపై అత్యాచారం కేసులో ఒంగోలు ఫోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాజా వెంకటాద్రి సంచలన తీర్పు చెప్పారు... 2017లో 15 ఏళ్ల మైనర్‌ విద్యార్దినికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లి అత్యాచారం చేసిన మ్యాథ్స్‌ టీచర్‌ అప్సర్‌ బాషాకు శిక్ష ఖరారు చేశారు... నిందితుడిపై నేరం రుజువైనందున మరణించేవరకు జైలు శిక్ష, 25 వేల జరిమానా విధించారు... బాధితురాలికి 7 లక్షల పరిహారం అందించేలా చూడాలని న్యాయసేవాధికార సంస్థను ఆదేశించారు.

AP News: మాయ మాటలు చెప్పి బాలికను ట్రాప్ చేసిన మ్యాథ్స్ టీచర్.. కోర్టు సంచలన తీర్పు
Judgement
Follow us
Fairoz Baig

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 03, 2024 | 3:22 PM

ప్రకాశం జిల్లాలోని ఓ స్కూల్లో విద్యను అభ్యసిస్తున్న బాలికతో(15) అదే స్కూల్‌లో మ్యాథ్స్ టీచర్‌గా పని చేస్తున్న షేక్ మొహమ్మద్ అప్సర్ బాషా (32) చనువుగా ఉంటూ ఫోన్లో చాటింగ్ చేసేవాడు… అంతేకాకుండా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని తెలుసుకుని స్కూల్ ప్రిన్సిపాల్‌కు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడ్ని తొలగించారు… అయినా మళ్లీ కొంతకాలం తర్వాత అతను ఒంగోలులో చదువుకుంటున్న ఆ మైనర్ బాలికకు మాయ‌మాట‌లు చెప్పి 2017 ఆగస్టు 6వ తేదిన తనతో హైదరాబాదు, ఆ తరువాత నరసరావుపేట నగరాలకు తీసుకెళ్లి శారీరకంగా కలిశాడు… ఒకవైపు బాలికతో సహజీవనం చేస్తూ ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు… బాలికను తన చెల్లెలుగా చెబుతూ తాను ఉన్న ప్రాంతాల్లో జనాన్ని మభ్య పెట్టాడు… మరోవైపు బాలిక కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు… ఈ ఫిర్యాదును విచారించిన పోలీసులు ఒంగోలు టూ టౌన్ పీఎస్‌లో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు… అప్పటి ఒంగోలు విచారణ అధికారులుగా ఉన్న పలువురు డిఎస్‌పిలు సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితుడ్ని రిమాండ్‌కు పంపి కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.

అనంతరం పోలీసులు కాలానుగుణంగా సాక్షులను కోర్టు ముందు హాజరుపర్చడంతో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసుంధర ప్రాసిక్యూషన్ తరుపున వాదించారు… ఈ కేసులో పోలీసులు ప్రత్యేక పోక్సో మానిటరింగ్ టీం ద్వారా సమర్థవంతంగా ట్రయల్ నడిపి సరైన సాక్షాదారాలతో నిందితుడుపై పలు సెక్షన్‌ల కింద నేర నిరూపణ చెశారు… దీంతో ఈనెల 2వ తేదిన ఒంగోలులోని పోక్సో కోర్ట్ ఇంచార్జి జడ్జి రాజా వెంకటాద్రి నిందితుడుకి మరణించేంత వరకు జైలు శిక్ష, అలాగే 25 వేల రూపాయల జరిమానా విధించారు… అదే విధంగా బాధితురాలికి 7 లక్షల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయసేవ అధికార సంస్థను ఆదేశించారు.

ఒంగోలు పోక్సో కోర్టు ఇన్‌చార్జి జడ్జి రాజా వెంకటాద్రి ఇచ్చిన ఈ తీర్పు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు పాల్పడే వారికి గుణపాఠంగా ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు… మహిళలు/మైనర్ బాల బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసునేందుకు ఇలాంటి తీర్పులు ఉపయోగపడతాయన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు… చిన్న పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడే వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుండి తప్పించుకునే వీలులేకుండా కోర్టులో పకడ్బందీగా ట్రయిల్ మానిటరింగ్ చేస్తూ నిందితులకు కఠిన శిక్షలు పడే విధంగా కృషి చేసిన పోలీసులను మహిళలు, ప్రజా సంఘాల నేతలు అభినందించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..