Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: హోం మంత్రి సడన్‌ సర్‌ప్రైజ్‌.. ఆమె చేసిన పనికి అవాక్కైన అధికారులు..

ఏపీ హోం శాఖ మంత్రి అనిత సోమవారం రాత్రి సడ్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. కాన్వాయ్‌లో వెళ్తున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కారు ఆపి కిందికి దిగారు. అక్కడే రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టు దగ్గరకు వెళ్లారు. అక్కడ చేస్తున్న తందూరి ఛాయ్‌ విధానాన్ని ఆసక్తిగా గమనించారు. ఆ తర్వాత ఆమె చేసిన పనికి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంతే మంత్రి ఏం చేశారనేగా..

Andhra Pradesh: హోం మంత్రి సడన్‌ సర్‌ప్రైజ్‌.. ఆమె చేసిన పనికి అవాక్కైన అధికారులు..
Ap Home Minster Anitha
Follow us
Maqdood Husain Khaja

| Edited By: Narender Vaitla

Updated on: Dec 03, 2024 | 5:09 PM

ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు.. వెళ్తూ వెళ్తూ కాన్వాయ్‌ని ఆపి వాహనం దిగారు. అక్కడే రోడ్డుపై ఉన్న చాయ్ దుకాణనికి వెళ్లారు. హోం మంత్రి లాంటి టీ కొట్టుకు రావడంతో అంతా అవ్వక్కయ్యారు. పోలీసుల హడావుడి పెరిగింది. హోం మంత్రి సెడన్‌గా కాన్వాయ్‌ ఆపి దిగగానే ఆ షాపు యజమానికి కూడా కాస్త కంగారు పడ్డాడు. హోం మంత్రి స్వయంగా రావడంతో అక్కడ ఏదో జరిగి ఉంటుందని కొందరు అనుకుంటే.. మరికొందరైతే ఆసక్తిగా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు.. అక్కడకు వెళ్లిన హోం మంత్రి చేసిన పనికి అంతా ఒకింత షాక్‌కి గురయ్యారు.

మంత్రిగారంటే మామూలు విషయం కాదు.. రాష్ట్రమంతా ఓ శాఖకు బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది.. అది కూడా కీలక హోమ్ శాఖ అయితే.. మరీ బాధ్యతలు పెరుగుతాయి.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పర్యవేక్షించే హోంశాఖ అత్యంత కీలకం.. ఆ విధుల్లో ఆమె బిజీ బిజీగా ఉంటారు.. అంతేకాదు హోంశాఖకు మంత్రిగా ఉన్న అనిత ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి ఆమె ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు విజయనగరం జిల్లాకు ఆమె ఇన్చార్జి మంత్రి కూడా.. దీంతో అటు హోమ్ శాఖ బాధ్యతలు.. ఇటు ఇంచార్జ్ మంత్రిగా విజయనగరం జిల్లాలో పర్యవేక్షణ.. సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు పై దృష్టి.. ఇంత బిజీ టైం లోనూ ఆమె కాస్త రిలాక్సేషన్ ఉంటే చాలు అనుకుంటారు మంత్రులు.. హోం మంత్రి గారు అలాగే కాస్త రిలాక్స్ అవడం కాదు సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు..

Home Minster Anitha

ఎంవిపి కాలనీలో ఉన్న దమ్ టీ స్టాల్ ని విజిట్ చేశారు హోంమంత్రి. ఇక్కడ చాయి చాలా బాగుంటుంది అంట కదా.. అంటూ అటుగా వెళ్లారు. చాయ్ తయారీ విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. నిర్వాహకులతో ముచ్చటించారు. కంచు పాత్రలో కొంపటిలా పెట్టి అందులో కాగిన మట్టి కుండలో చాయి వేసి సర్వ్ చేయడం అక్కడ స్పెషలిటీ.. అదే హోం మంత్రి నచ్చేసింది.. టేస్ట్ కూడా బాగుంటుందని ప్రచారం జరగడంతో ఆమె స్వయంగా అక్కడ చాయ్ టెస్ట్ చూసేందుకు వెళ్లారు. అంతేకాదు.. ఆమె స్వయంగా తందూరి టీ ని కాచి అందరి దృష్టిని ఆకర్షించారు. అక్కడ చాయిని టేస్ట్ చూసి వాహ్ అన్నారు. ఒక హోం మంత్రి కాన్వాయ్ దిగి సామాన్య మనుషిలా టీ స్టాల్ కు వెళ్లి వాళ్లను పలకరించి టీ ని స్వయంగా కాచి తయారీ విధానాన్ని తెలుసుకొని టి టెస్ట్ చేసినందుకు ఒకింత అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనుకోని అతిధుల వచ్చినందుకు నిర్వాహకులు మంత్రి గారికి ధన్యవాదాలు చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..