AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. ఎన్ని గంటల సమయం పడుతుందంటే..

మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. భక్తులు రద్దీగా ఉండడంతో స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ.. ఎన్ని గంటల సమయం పడుతుందంటే..
Devotees Rush Srisailam
Jyothi Gadda
|

Updated on: Jan 19, 2025 | 10:57 AM

Share

నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులు ముగుస్తుండడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. క్షేత్రమంత భక్తజనంతో సందడి వాతావరణం నెలకొంది. భక్తులు వేకువజామున నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు.. శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూ కట్టారు. దీంతో క్యూలైన్లు, దర్శన కంపార్టుమెంట్లలో భక్తులు బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 5 గంటల సమయం పడుతుంది.

మరోపక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని, ఆది, సోమవారలో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన నిలుపుదల చేశారు. భక్తులు రద్దీగా ఉండడంతో (BREAK) స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. అయితే భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకునేలా ఆలయ ఈవో శ్రీనివాసరావు, అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

దర్శనార్థమై క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాస రావు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
తల్లులూ డైపర్లు వాడే ముందు ఈ తప్పు అస్సలు చేయకండి
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
వయస్సు పెరిగితే తండ్రి కావడం కష్టమా? సైన్స్ ఏమి చెబుతోంది?
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
మహీంద్రా నుంచి కొత్త థార్ విడుదల..పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌..ధర తక్కువే
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఇంటర్ అర్హతతో.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఛాయ్ చేతికి ఇవ్వలేదని దారుణం..!
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతున్న పెంగ్విన్ వీడియో.. దాని వెనుక ఉన్న
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
ఆ సినిమా ఆడదని దిల్ రాజుకు చెప్పిన భార్య.. కట్ చేస్తే..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు..
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
ఎంతకు తెగించార్రా.. రీల్స్ పిచ్చితో ప్రాణాలు తీస్తారా.. వందే భారత
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌
టెన్త్‌ అర్హతతో రైల్వేలో 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌