Lack of Sleeping: ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నిద్రలేకపోతే.. ఎన్ని నష్టాలో తెలుసా..? బీ అలర్ట్..
మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే, రోజూ తగినంత నిద్రపోవడం తప్పనిసరి. ప్రతి ఒక్కరికీ 7 నుంచి 8 గంటల నిద్ర తప్పని సరి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది మన శరీరంలోని అనేక సమస్యలను సరిచేస్తుంది. మిమ్మల్ని ఫ్రెష్‌గా చేస్తుంది. మన జ్ఞానశక్తి సామర్థ్యానికి, జ్ఞాపకాలను ఏకీకృతం చేయడానికి, సమస్యలను పరిష్కరించడానికి మంచి నిద్ర ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. 8 గంటలు నిద్రపోకపోవడం వల్ల ఎలాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందో ఇక్కడ తెలుసుకుందాం?
Updated on: Jan 19, 2025 | 7:44 AM

పడుకునే ముందు ఏదైనా పుస్తకం చదవడం అలవాటు చేసుకోండి. ఈ టెక్నిక్ మీకు ఖచ్చితంగా సహాయపడుతుంది. NIH అధ్యయనం ప్రకారం, పడుకునే ముందు బెడ్ మీద కూర్చుని పుస్తకం చదివే అలవాటు నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. అలాని ఫోన్‌లో కథలు, నవలలు చదవకూడదు. బదులుగా, పుస్తకం పట్టుకుని చదవడం అలవాటు చేసుకోవాలి.

ముందుగా బెడ్‌పై ఉపయోగించే షీట్‌లు అన్నీ కాటన్‌వి మాత్రమే ఉండాలని గుర్తుంచుకోండి. లేత రంగులను మాత్రమే ఎంచుకోవాలి. తెలుపు,దా లేత పసుపు రంగు బెడ్ షీట్లను ఉపయోగించవచ్చు. ఏ రోజు కారోజు సాయంత్రం బెడ్ షీట్లను మార్చితే తాజా అనుభూతిని ఇస్తుంది. తద్వారా త్వరగా నిద్రపోతారని నిపుణులు అంటున్నారు.

7 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. సరిగ్గా నిద్రపోకపోతే చిరాకు, కోపం, ఒత్తిడికి గురవుతారు. నిద్రలేమి కారణంగా మీరు ఉదయం అలసటతో మేల్కొంటారు. ఈ అలసట రోజంతా మీవెంటే ఉంటుంది. దీని వల్ల మీరు ఏ పనిపైనా దృష్టి పెట్టలేరు. మీ శరీరానికి తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల మీరు సరైనా నిర్ణయాలు కూడా తీసుకోలేరు.

అంతేకాదు.. నిద్ర లేకపోవడం వల్ల ప్రత్యక్ష ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రదేశాలలో దీని ప్రభావం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫలితంగా, కళ్ల కింద చారలు లేదా నల్లని వలయాలు, మచ్చలు ఏర్పడతాయి.

నిద్ర లేకపోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. దీని కారణంగా టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది కాకుండా, హృదయ స్పందన కూడా పెరుగుతుంది. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. ఇతర వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.




