AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆరోగ్య నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇందుకోసం పోషక విలువలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నెయ్యి ఒకటి. ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పోషకాహార నిపుణులు చలికాలంలో నెయ్యిని తప్పనిసరిగా ఏదో రూపంలో తీసుకోవాలని సూచిస్తున్నారు.చలికాలంలో నెయ్యి తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.

Jyothi Gadda
|

Updated on: Jan 19, 2025 | 7:06 AM

Share
నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ శరీరంలోని అదనపు కొవ్వులను తొలగిస్తుంది. జీర్ణ ఆరోగ్యానికి నెయ్యి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో అద్భుతం చేస్తుంది. నెయ్యి శరీరానికి దీర్ఘకాలిక శక్తిని అందించే మంచి కొవ్వు అధికంగా ఉండే ఆహారం. నెయ్యిలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, ఇవి మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. అందువల్ల, ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, మానసిక ప్రశాంతతకు ప్రయోజనకరంగా ఉంటుంది.

1 / 5
నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. రోజూ తగిన మోతాదులో తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఉండదు. ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండదు. నెయ్యిలో తగినంత కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి నడవడం తేలికవుతుంది. ఇందులో విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

2 / 5
ఖాళీ కడుపుతో ఒక టీస్పూన్ నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. నెయ్యి పరగడుపున తింటే గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. నెయ్యి మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యి చర్మాన్ని బిగుతుగా, మృదువుగా, లోపలి నుంచి మెరిసేలా చేస్తుంది. నెయ్యిలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది దంతాలను బలంగా చేస్తుంది.

3 / 5
నెయ్యిలో శోథ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్, ఉబ్బసం, పేగు వ్యాధులు, ఇతర వైద్య పరిస్థితులతో బాధపడుతున్న వారికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులలో ఇతర ప్రమాదాలను గణనీయంగా తగ్గించడంలో శోథ నిరోధక లక్షణాలు కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నెయ్యి ఎముకలను బలపరుస్తుంది. కీళ్ల వశ్యతను కాపాడుతుంది. కీళ్లలో వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

4 / 5
నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయిన విటమిన్ ఎ, ఇ ఉంటాయి. ఇవి కంటిచూపు, చర్మ సౌందర్యం, గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి. అనేక పోషకాలు నెయ్యిలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యకరమైన జీర్ణక్రియను నిర్వహించడానికి సహాయపడతాయి. చలికాలంలో నెయ్యి తినడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. నెయ్యిలో యాంటీ ఇంఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి బాడీలో వివిధ రకాల మంట, వాపు సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

5 / 5